https://oktelugu.com/

Raj Tharun : నాకు నా భర్త రాజ్ తరుణ్ కావాలన్న లావణ్య.. రాజ్ తరుణ్ రియాక్షన్ వైరల్…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటి నటులు చాలా జాగ్రత్త గా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన కూడా వాళ్ల సినీ కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 31, 2024 / 09:55 PM IST
    Follow us on

    Raj Tharun  : ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి రాజ్ తరుణ్ గత కొన్ని రోజుల నుంచి సినిమాల పరంగా ప్లాప్ లను ఎదుర్కొంటూ వస్తున్నాడు. అయినప్పటికీ తను ఏదో ఒక రోజు మంచి సక్సెస్ ని సాధించి స్టార్ హీరోగా ఎదుగుతాడని అనుకుంటున్నా క్రమంలో అతని మాజీ ప్రేయసి అయిన లావణ్య నన్ను రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఈ కేసు కు సంబంధించిన వివరాలను అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య ఇద్దరు తెలియజేస్తూనే వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ నాకు సమాధానం చెప్పేంతవరకు అతన్ని నేను వదిలిపెట్టను. అతను ఏ తప్పు చేయకపోతే ఎందుకు నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మేము గత పది సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము. మా పెళ్లి ఫోటోలను కూడా పోలీసులకు అందించాను. నా భర్త రాజ్ తరుణ్ నాకు కావాలి… ఆయన నాకు రెండుసార్లు అబర్షన్ చేయించాడు. వీటన్నింటికీ ఆయన నాకు సమాధానం చెప్పేంతవరకు తనను నేను వదిలిపెట్టను అంటూ లావణ్య చాలా ఘాటు గా మాట్లాడింది…

    ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ‘తిరగబడరా సామి’ అనే సినిమాకు సంబంధించిన క్యూ అండ్ ఏ శేషన్ ను ఈరోజు నిర్వహించారు. ఇక అందులో పాల్గొన్న రాజ్ తరుణ్ మాట్లాడుతూ సినిమా గురించి కాకుండా తన పర్సనల్ విషయాలను అతను షేర్ చేసుకున్నాడు…లావణ్య మ్యాటర్ ని ఉద్దేశించి కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ముందుగా ఆయన ఈ ఈవెంట్ కి రావడానికి గల ముఖ్య కారణం తను ఇంతకు ముందు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడట. ఇంట్లో ఉండటం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్ననని అందుకే మీడియా ముందుకి వచ్చానని చెప్పాడు. ఇక లావణ్య విషయంలో నాది ఏ తప్పు లేదని, ఆమె మీద నేను లీగల్ గా ఫైట్ చేస్తున్నాను…

    ఆమె చెప్పిన ప్రతిదీ అబద్ధమే అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వాటిని కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాను అంటూ రాజ్ తరుణ్ సమాధానం ఇచ్చాడు. అలాగే రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరో గా చేసిన ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా క్యూ అండ్ ఏ శేషన్ కి మీరు ఎందుకు హాజరు అవ్వలేదు అని ఒక రిపోర్టర్లు అడగగా దానికి సమాధానం చెబుతూ అప్పుడు నా మానసిక స్థితి బాగాలేదు…అందువల్లే నేను బయటికి రాలేకపోయాను. ఇప్పుడు మాత్రం బయటికి రాకపోతే నేను ఇంకా ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉండేవాడిని అందుకే తెగించి మరి బయటికి వచ్చాను.

    నేను చాలా మృదు స్వభావిని ఎవరితో ఎలాంటి విభేదాలను పెట్టుకోవడానికి ఇష్టపడను. అలాగే నా లైఫ్ లో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. పెళ్లంటే నాకు భయం. పెళ్లి అనే ఒక బంధం లో మనం చిక్కుకుంటే బయటికి రాలేము అనే ఉద్దేశంతోనే నేను మొదటినుంచి కూడా పెళ్లి కి చాలా దూరం గా ఉంటూ వస్తున్నాను…ఇక ఇదే సమయం లో ఒక రిపోర్టర్ మీరు లావణ్య కి రెండు సార్లు అబార్షన్ చేయించారట అది నిజమేనా అని అడిగాడు.

    ఇక దాని రాజ్ తరుణ్ సమాధానం చెబుతూ నేను అబార్షన్ చేయించినట్లైతే దానికి సంభందించిన సెక్షన్ మీద ఆమె కేసు పెట్టాలి కదా.. ఎందుకు పెట్టలేదని అంటూనే ఇక మీడియా ముందుకు వచ్చి గోల చేసి మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేను లావణ్య గురించి చెప్పిన ప్రతీది నిజమని కోర్టులో ప్రూవ్ చేస్తాను. దానికి సంబంధించిన సాక్షాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటూ రాజ్ తరుణ్ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు… ఇక అదే విధంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘మాల్వి మల్హోత్రా’ కూడా లావణ్య టాపిక్ గురించి మాట్లాడుతూ ఆమె ఎందుకని నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఆమె నన్ను నా సోదరుడిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. దానికి సంబంధించిన లీగల్ ఫైట్ ని మేము కూడా చేస్తున్నాము…

    అసలు ఆమె ఎవరో కూడా ఇప్పటివరకు నాకు మా పేరెంట్స్ కి తెలియదు. అయిన కూడా మేము ఆమె మీద దాడి చేస్తున్నామంటూ కేసు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం… నా మొదటి సినిమా సమయంలోనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడం, నేను ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అనేది నిజంగా బాధేస్తుంది…

    ఇక ఈ వివాదాలు చూసిన తర్వాత మా పేరెంట్స్ సినిమాలు వద్దు, ఏం వద్దు ఇంటికి వచ్చేసేయ్ అంటూ చాలా ఫోర్స్ చేశారు. అయినప్పటికీ నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి దాన్ని నిరూపించుకొని నాకు నచ్చిన సినిమా ఫీల్డ్ లో నేను ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ దాకా వచ్చాను. అంటూ తను సమాధానం చెప్పింది…ఇక మొత్తానికైతే రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పాలి…