Hero Arrest News: తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్(Actor Srikanth). ఇతన్ని శ్రీరామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గానే ఇతను తెలుగు లో ‘పిండం’ అనే చిత్రం ద్వారా సూపర్ హిట్ ని అందుకున్నాడు. అదే విధంగా ఓటీటీ లలో పలు వెబ్ సిరీస్లు, వెబ్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే ఇతన్ని రీసెంట్ గానే మాదక ద్రవ్యాలు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇతను చెన్నై లో నున్నుమ్ బాకం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఒక స్పెషల్ ఆఫీసర్ ఈయన్ని విచారిస్తున్నారు. ఈ విచారణ లో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. అసలు ఈ కేసులో ఎలా శ్రీకాంత్ ఎలా చిక్కుకున్నాడు, అసలు ఏమి జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం.
తమిళనాడు లోని AIADMK పార్టీ కి చెందిన ప్రశాంత్(Prashanth) అనే వ్యక్తి నున్నుమ్ బాకం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ బార్ ని నడుపుతున్నాడు. ఇక్కడ మాదకద్రవ్యాలను అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఆ బార్ పై రైడింగ్ చేసి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ లో తాను నటుడు శ్రీకాంత్ కి మాదక ద్రవ్యాలు అమ్మినట్టు పోలీసులకు తెలిపాడు. దీనితో పోలీసులు శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకొని అతనికి మెడికల్ టెస్టులను నిర్వహించారు. శ్రీకాంత్ బ్లడ్ ని టెస్టింగ్ కోసం తీసుకున్న పోలీసులు, అతను నిజంగా మాధద్రవ్యాలు తీసుకున్నాడా లేదా అనేది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందని మీడియా కి తెలియజేసారు. అదే విధంగా విచారణ ప్రశాంత్ ఇచ్చిన రిపోర్ట్ గురించి తెలిసిన మరికొన్ని విషయాలు ఏమిటంటే, శ్రీకాంత్ ‘తింగరై’ అనే చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అతను తనని కాంటాక్ట్ అయ్యాడని, అతనికి 12 వేల రూపాయలకు మాదకద్రవ్యాలు అమ్మాను అని చెప్పుకొచ్చాడు.
Also Read: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?
శ్రీకాంత్ మరియు నటుడు కృష్ణ ఆ సరుకు ని చెన్నై లోని కొన్ని ప్రైవేట్ బార్స్ లో కూడా అమ్మారని ప్రశాంత్ పోలీసులకు వెల్లడించారు. ప్రశాంత్ ఇచ్చిన సమాచారం ప్రకారం నటుడు కృష్ణ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిజానిజాలేంటో త్వరలోనే తెలియనున్నాయి. ఒక నటుడిగా ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణం లో ఇన్నాళ్లు కొనసాగడం అనేది సాధారణమైన విషయం కాదు. కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయంలో ఈ ఇద్దరు నటులు అనవసరం గా తప్పు దారిలోకి వెళ్లి కెరీర్స్ ని నాశనం చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. శ్రీకాంత్ మన తెలుగు ఆడియన్స్ కి ‘రోజా పూలు’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసాడు.