Arjun: హీరో అర్జున్​కు కరోనా పాజిటివ్​..ట్విట్టర్​లో వెల్లడి

Arjun: కరోనా మహమ్మారి పోయిందనుకున్న ప్రతిసారి మరో కొత్త వేరియంట్ అవతారమెత్తి ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. మెల్లగా ఒక్కొక్కరిపై దాడి చేస్తూ.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమవుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు ఇలా ఎవరన్నది దానికి అక్కర్లేదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా వచ్చి మీద పడి ప్రాణాలు పిండేస్తోది ఈ మహమ్మారి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు వంటి మహామనులనే పొట్టన పెట్టుకుంది […]

Written By: Raghava Rao Gara, Updated On : December 14, 2021 12:06 pm
Follow us on

Arjun: కరోనా మహమ్మారి పోయిందనుకున్న ప్రతిసారి మరో కొత్త వేరియంట్ అవతారమెత్తి ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. మెల్లగా ఒక్కొక్కరిపై దాడి చేస్తూ.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమవుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు ఇలా ఎవరన్నది దానికి అక్కర్లేదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా వచ్చి మీద పడి ప్రాణాలు పిండేస్తోది ఈ మహమ్మారి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు వంటి మహామనులనే పొట్టన పెట్టుకుంది ఈ కరోనా.

కాగా, ఇటీవల కాలంలో మరికొంత మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికీ ఈ కరోనా వారివెంట పడుతూనే ఉంది. మొన్న కమల్​హాసన్​ ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. తాజాగా, బాలీవుడ్​ నటి కరీనా కపూర్​కు కూడా కొవిడ్​ సోకింది. ఇప్పుు మరో నటుడు కూడా ఈ కరోనా బారిన పడ్డారు.

యాక్షన్​ కింగ్​ అర్జున్​కు తాజాగా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. నాకు కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా.. అందరూ జాగ్రత్తగా ఉండండంటూ రాసుకొచ్చారు అర్జున్​. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్​ బాషల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలన్​గానే కాకుండా విభిన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుతున్నారు అర్జున్​.