Rohit quits: టీంఇండియా జట్టులో తాజాగా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నెలకొన్న కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్లే కన్పిస్తోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే భారత జట్టులో లుకలుకలు బయటపడుతుండటంతో క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు మూడు టెస్ట్, మూడు వన్డే సిరీసులను ఆడనుంది. టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా వన్డే జట్టుకు మాత్రం అతడిని బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. తనతో మాటమాత్రం చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ గుర్రుగా ఉన్నారు.
దీంతోనే అతడు ఇటీవల ముంబైలో బీసీసీఐ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.అలాగే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే ఆటగాళ్లంతా మూడ్రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అయితే కోహ్లీ మాత్రం ఇప్పటివరకు కూడా జట్టుతో కలువలేదు. దీంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటకు వస్తాడా? రాడా అన్న అనుమానాలు కలిగాయి.
ఈ పరిస్థితుల్లోనే టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టీంకు దూరమయ్యాడు. ఆదివారం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తొడకండరాలు పట్టేయడంతో అతడు టెస్టు సీరిస్ కు దూరమ్యాడని బీసీసీఐ ప్రకటించింది.అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా వన్డే సీరిసుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడని పేర్కొంది.
Also Read: ‘డేవిడ్’ కోసం భారీ స్కెచ్ వేసిన ఆర్సీబీ..!
మరోవైపు వన్డే సిరీసుకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని ఓ అధికారి ట్వీస్ట్ ఇవ్వడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో భారత్ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న నేపథ్యంలోనే కోహ్లీ తప్పుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రోహిత్, కోహ్లీ మధ్య తారాస్థాయిలో విబేధాలు ఉన్నాయనే సంకేతాలు మాత్రం బయటికి బలంగా వెళుతున్నాయి.
దీంతో ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుందా? అన్నక్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. లేనట్లయితే ఈ పరిణామాలన్నీ భారత జట్టుకు చేటుచేసే అవకాశం ఉందని టీంఇండియా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!
Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమేనా?