Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం మెగా ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది. వినాయక చవితి నాడు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం సాయి ధరమ్ తేజ్ ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరై ఇంటికి బైక్ పై వస్తుండగా… ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న ఆయన బైక్ అదుపు తప్పడంతో ధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. పక్కనే ఉన్న జనాలు పోలీసులకు, అంబులెన్సుకి సమాచారం ఇవ్వడంతో, సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ధరమ్ తేజ్ ని పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్(Sai Dharam Tej) స్పృహ కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ కి ప్రాణాపాయం లేదని వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. అయితే నెల రోజులకు పైగా అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత కూడా ఆయన స్పృహలోకి రాలేదు. ఆయన నుండి ఫ్యాన్స్ కి ఎటువంటి సందేశం లేదు. ఈ క్రమంలో సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటనే సందేహాలు తలెత్తాయి. ఆయన హెల్త్ అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత సాయి ధరమ్ కెమెరా ముందుకు వచ్చారు. దీపావళి నాడు మెగా హీరోలు అందరూ ఆయనను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. అప్పుడు కానీ అనుమానాలకు, ఆందోళనలకు తెరపడలేదు. తన యోగక్షేమాల కోరుకున్న వారికి సోషల్ మీడియా వేదికగా తేజ్ ధన్యవాదాలు తెలిపారు. మెగా ఫ్యామిలీ విడుదల చేసిన ఫొటోలో ధరమ్ తేజ్ ఫిట్ గానే కనిపించారు.
Also Read: టాలీవుడ్ భల్లాల దేవ రానా పుట్టినరోజు నేడు.. ఆయన సినీకెరీర్పై ప్రత్యేక కథనం
దీపావళి గడచి నెల రోజులు దాటిపోయింది. అయినప్పటికీ సాయి ధరమ్ కెమెరా ముందుకు రాలేదు. కొత్త సినిమా ప్రకటన చేయలేదు. అలాగే ఎటువంటి సినిమా ఈవెంట్ లేదా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనలేదు. సాయి ధరమ్ పూర్తిగా కోలుకున్నట్లు మెగా ఫ్యామిలీ వెల్లడించినప్పటికీ ఆయన తెర వెనుకే ఉండడం వెనుక కారణం ఏమిటో అర్థం కావడం లేదు.
ప్రమాదం జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ అసలు మాట్లాడలేదు. ఆయన వాయిస్ వినాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఆ ముసుగు వెనక, బయటికి రావాలని కోరుకుంటున్నారు.
Also Read: సౌత్ ఇండస్ట్రీ లేకపోతే.. ఇండియన్ సినిమా లేనట్లే !