Tamil Hero Ajith
Hero Ajith : సౌత్ లో హీరోలను దేవుళ్ళు లాగా కొలుస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా తమిళనాడు లో రజినీకాంత్(Superstar Rajinikanth), అజిత్(Thala Ajith), విజయ్(Thalapathy Vijay) లకు ఉన్న క్రేజ్ వేరు. వీరిలో రజినీకాంత్, విజయ్ వంటి వారు అభిమానులతో వివిధ సందర్భాల్లో అనేక రకమైన ఈవెంట్స్ లో అభిమానులతో కనెక్షన్ లోనే ఉంటారు. కానీ అజిత్ కి అభిమానులతో ఎలాంటి కనెక్షన్ ఉండదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ ఈవెంట్స్ తన సినిమాలకు చేయడానికి ఇష్టపడడు, అంతే కాకుండా తన సినిమాల కోసం ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించడు. సోషల్ మీడియా మాధ్యమాలలో ఉండదు. పోనీ సినిమాలైనా సరిగ్గా తీస్తాడా అంటే అది కూడా లేదు. హాఫ్ బేక్డ్ సినిమాలతోనే గత దశాబ్ద కాలం నుండి ఆయన తన కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. వాటికి భారీ వసూళ్లు కూడా వస్తున్నాయి. కనీసం లుక్స్ పరంగా అయినా అజిత్ ని చూసి సంతోషపడుదాం అంటే, అది కూడా లేకుండా చేసాడు అజిత్.
Also Read : నైజాంలో అదుర్స్..ఆంధ్రలో బెదుర్స్..’ఆర్య 2′ రీ రిలీజ్ బుకింగ్స్ పరిస్థితి!
తెల్లని జుట్టుతో, 50 ఏళ్ళ వయస్సులోనే 70 ఏళ్ళ ముసలి వాడిగా కనిపిస్తూ ఉంటాడు. రీసెంట్ గానే ఆయన బాగా సన్నబడ్డాడు. సన్నబడిన తర్వాత అజిత్ లుక్స్ ని చూసి అభిమానులు ఏడవడం ఒక్కటే తక్కువ. ముఖం మొత్తం ముడతలు ఏర్పడి, ఎదో రోగం వచ్చి ఆరోగ్యం బాగాలేని వాడిగా కనిపించాడు. ఆ రీసెంట్ ఫోటోలను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు. సౌత్ లోనే అందమైన హీరోలలో ఒకరు అజిత్. ఆయన తన లుక్స్ ని పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తూ వస్తే అజిత్ ని మించిన అందగాడు సౌత్ లో ఎవ్వరూ లేరు అనడంలో అతిశయోక్తి కాదేమో. కానీ లుక్స్ మైంటైన్ చేయడు, ఇప్పుడు చూస్తే ఇలా తయారయ్యాడు. ఇలా ఇండియా లో అభిమానులకు ఒక్క కలెక్షన్స్ విషయం లో తప్ప, ఎందులోనూ సంతోషం ఇవ్వని హీరోగా అజిత్ నిల్చిపోయాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
అయితే ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ అజిత్ ని ఆయన అభిమానులు విడిచిపెట్టలేదు. బహుశా ఇలాంటి లాయర్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో అజిత్ మాత్రమే.ఆయన గత చిత్రం విడాముయార్చి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి, అదే విధంగా క్లోజింగ్ కూడా 150 కోట్ల రూపాయిల రేంజ్ లో వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక హాఫ్ బీట్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం మరో హీరో కి అసాధ్యం అని చెప్పొచ్చు. అభిమానులు ఇంతలా ఆరాధిస్తున్నారు, కనీసం వాళ్ళ ఆనందం కోసం జీవితాంతం గుర్తించుకోదగ్గ మరొక్క సినిమా ఇవ్వొచ్చు కదా అని విశ్లేషకులు సైతం సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో అడిగారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం అలా అభిమానులను అలరించే సినిమా అవుతుందని అందరూ అనుకుంటున్నారు, మరి అది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఈ నెల 10 వరకు ఆగాల్సిందే.
Also Read : ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు..’హరి హర వీరమల్లు’ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!