Arya 2' re-release Bookings
Arya 2′ re-release : ఈ నెల 7వ తారీఖున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 5వ తారీఖున ‘ఆర్య 2′(Aarya 2 Re Release) చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుండి ప్రారంభిస్తూ వస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లోని కొన్ని సెలెక్టెడ్ మెయిన్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, పాతిక లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ లిమిటెడ్ షోస్ ద్వారానే వచ్చింది. ఆ తర్వాత నేడు పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన రోజున ఈ సినిమాకు 15 వేల టిక్కెట్లు ఈ సినిమాకు అమ్ముడుపోయాయి.
Also Read : ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు..’హరి హర వీరమల్లు’ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!
నేడు బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు రెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి రెండవ రోజున 20 వేల టికెట్స్ అమ్ముడుపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. నైజాం లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్పీడ్ గా ఉన్నాయి. కచ్చితంగా ఆల్ టైం టాప్ 5 రీ రిలీజ్ గ్రాసర్స్ లో ఒకటిగా నైజాం లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. గుంటూరు, కృష్ణ, ఉత్తరాంధ్ర ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ బిలో యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. ఇక సీడెడ్ ప్రాంతం విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకని ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి?, తెలంగాణకు, ఆంధ్ర ప్రదేశ్ కి మధ్య ఇంత వ్యత్యాసమా?, కచ్చితంగా ఎదో బలమైన ప్రభావం పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాస్ రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ రీ రిలీజ్ గ్రాస్ అనొచ్చు. గతంలో ‘దేశముదురు’ సినిమాని రీ రిలీజ్ చేయగా, దాదాపుగా కోటి 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డు ని ఈ సినిమా బీట్ చేసే అవకాశం ఉంది. అయితే గత రీ రిలీజ్ చిత్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా విడుదల అయ్యాయి. కానీ ‘ఆర్య 2 ‘ చిత్రం మాత్రం విడుదల కావడం లేదు. ఒకవేళ ఓవర్సీస్ లో కూడా విడుదల అయ్యుంటే కచ్చితంగా ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజున వచ్చి ఉండేవని అంటున్నారు విశ్లేషకులు.