Hari Hara Veeramallu Movie : మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో అత్యధిక సార్లు వాయిదా పడిన సినిమా ఏదైనా ఉందా అంటే, అది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం మాత్రమే. ఈ సినిమా ప్రారంభం నుండి ఇప్పటి వరకు, ఒకసారి కాదు, రెండు సార్లు ఏకంగా 12 సార్లు విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. ఎప్పుడో 2020 వ సంవత్సరం లో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవ్వడం, మధ్యలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడం, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం తో ఈ సినిమాని కాసేపు పక్కన పెట్టి రీమేక్ సినిమాలు చేయడం వంటివి చేసాడు. దీంతో మేకర్స్ కి బడ్జెట్ కూడా డబుల్ పెరిగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ని గట్టిగా అడగలేక, మింగలేక, కక్కలేక ఉంటున్నారు.
Also Read : సుకుమార్ పుష్ప సినిమా టైటిల్ పెట్టడం వెనక ఇంత కారణం ఉందా..?
ఇకపోతే ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. షూటింగ్ అనుకున్న సమయానికి పవన్ కళ్యాణ్ పూర్తి చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా మార్చి 28 న విడుదల అయ్యేది. కానీ ఆయన డేట్స్ ఇవ్వలేదు. కేవలం వారం రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయేది, కానీ మధ్యలో ఆరోగ్య సమస్యల కారణంగా మూడు నెలలు బ్రేక్ ఇచ్చాడు. దీంతో మూవీ ని మే 9 కి వాయిదా వేశారు. ఏప్రిల్ 14 లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తానని నిర్మాతలకు మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. ఒకవేళ ఆయన షూటింగ్ పూర్తి చేసినప్పటికీ కూడా మే 9న రావడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే VFX వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉందట. VFX షాట్స్ పూర్తి అయ్యి డెలివరీ అయ్యాక మనోజ్ పరమహంస కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట.
ఇవన్నీ విన్న తర్వాత అభిమానులు కూడా ఈ సినిమా మే 9న విడుదల అవుతుందంటే నమ్మడం లేదు. పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేసేవరకు ఈ సినిమాకి ఎన్ని విడుదల తేదీలు ఇచ్చినా వృధా ప్రయత్నమే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మే9న ఈ చిత్రం నిజంగా విడుదలయ్యే పరిస్థితులు ఉంటే, ఈపాటికి ప్రాంతాల వారీగా బిజినెస్ వ్యవహారాలు మొత్తం పూర్తి అయ్యేవి, వాటికి సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడేది. కానీ అలాంటివేమీ జరగలేదు. అనేక ప్రాంతాలకు బయ్యర్స్ ఎవరో కూడా ఫ్యాన్స్ కి తెలియని పరిస్థితి, వాలకం చూస్తుంటే మే 9 వచ్చే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా నుండి మూడవ పాటను ఈ నెల పదవ తారీఖున విడుదల చేయబోతున్నారు. ఇది మాస్ సాంగ్ అని వినికిడి. అదే విధంగా ఏప్రిల్ 15 న మెలోడీ సాంగ్ ని విడుదల చేయనున్నారు.
Also Read : రజినీకాంత్ కూలీ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించబోతుందో తెలుసా..?