Trending News: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!

Trending News: సాధారణంగా ఈ రోజుల్లో బడాబాబులు వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారం ప్రారంభం కోసం వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అనుకోని కారణాల వలన కంపెనీకి నష్టాలు రావడం, వ్యాపారం దెబ్బతినడంతో దివాళా తీస్తున్నారు. దీంతో బ్యాంకులు ఇచ్చిన అప్పులు చెల్లించలేక కొందరు ఏకంగా దేశాన్ని విడిచి పారిపోతున్నారు. ఆస్తులు అమ్మి చెల్లిందామనుకుంటే అప్పుల భారం వేల కోట్లు ఉంటుంది. దీంతో వారు ఐపీ పెట్టడం లేదా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే దేశాన్ని విడిచి […]

Written By: Mallesh, Updated On : January 21, 2022 11:09 am
Follow us on

Trending News: సాధారణంగా ఈ రోజుల్లో బడాబాబులు వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారం ప్రారంభం కోసం వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అనుకోని కారణాల వలన కంపెనీకి నష్టాలు రావడం, వ్యాపారం దెబ్బతినడంతో దివాళా తీస్తున్నారు. దీంతో బ్యాంకులు ఇచ్చిన అప్పులు చెల్లించలేక కొందరు ఏకంగా దేశాన్ని విడిచి పారిపోతున్నారు. ఆస్తులు అమ్మి చెల్లిందామనుకుంటే అప్పుల భారం వేల కోట్లు ఉంటుంది. దీంతో వారు ఐపీ పెట్టడం లేదా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే దేశాన్ని విడిచి పారిపోయి విదేశాల్లో తల దాచుకుంటున్నారు.

Trending News

ఇలా దేశీయ బ్యాంకులను మోసం చేసి దేశాన్నివిడిచి పారిపోయిన వారిలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మొహుల్ చోక్సీ లాంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ప్రస్తుతం వీరికి సంబంధించి స్థిర, చర ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకున్నాయి. అంతేకాకుండా వీరిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారు ఎక్కడైతే తల దాచుకున్నారో ఆయా దేశాల ప్రభుత్వాలతో మాట్లాడుతోంది. అక్కడి చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్‌ను ఆధారంగా చేసుకుని భారత బ్యాంకులను మోసం చేసి దర్జాగా విదేశాల్లో ఏంజాయ్ చేస్తున్నట్టు ఇక్కడి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అయితే, పైన వారికి భిన్నంగా ఓ మహిళ తనకున్న అప్పుల్లో ఏడాదిలోనే మూడు వేల కోట్లు బ్యాంకులకు తిరిగి చెల్లించి వారెవ్వా అనిపించింది. నష్టాల్లో ఉన్న కంపెనీలను నడిపించలేక మగమహారాజులే దేశాన్ని వదిలేసి పారిపోతుంటే ఒక మహిళ తన సత్తాను చాటి అప్పు ఇచ్చిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అంతేకాకుండా వందల మంది తమ ఉద్యోగులకు నేనున్నానంటూ భరోసానిచ్చింది. ఆమె ఎవరో కాదు మాళవిక హెగ్డే.. ‘కాఫీ డే’సంస్థ ఓనర్ సిద్ధార్థ్ సతీమణి.

Also Read: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. రూ.12,500 డిపాజిట్‌తో కోటి రూపాయలు!

కాఫీ డే కంపెనీకి మొత్తంగా 7వేల కోట్లు అప్పు ఉండగా, అది ఎలా తీర్చాలో తెలియక సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల్లో కాఫీ డే వ్యాపారాన్ని విస్తరించిన సిద్ధార్థ్.. అనుకోకుండా కంపెనీకి నష్టాలు రావడం తనువు చాలించాడు. ఈ క్రమంలోనే ఆయన భార్య మాళవిక హెగ్డే వ్యాపారాన్ని టేకోవర్ చేసుకుని ఏడాది కాలంలో 3 వేల కోట్ల అప్పు తీర్చింది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎన్ కృష్ణ కూతురు. తనదైన వ్యాపార మెళకువలతో అప్పులను తీర్చేసి బ్యాంకులను నమ్మకాన్ని కలిగించారు. మాళవిక ధైర్యాన్ని, తెగువను చూసి టాటా లాంటి దిగ్గజ కంపెనీలు కాఫీ డేలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు కూడా మరోసారి అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. భర్తను కోల్పోయి తనను నమ్ముకున్న వాళ్లను కాపాడుకునేందుకు ఒంటరి మహిళ చేస్తున్న పోరాట ఫలితమే ఇదని దేశవ్యాప్తంగా మాళవిక గురించి చర్చ నడుస్తోంది.

Also Read: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

Tags