Singer Chinmai : మీటూ ఆరోపణలు చేసినందుకు భారీ మూల్యం చెల్లించాను.. సింగర్ చిన్మయ భావోద్వేగం

మలయాళ ఇండస్ట్రీలో ఆగడాలను జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా పలువురు నటీమణులు గొంతెత్తుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయ కూడా దీనిపై స్పందించారు.

Written By: Mahi, Updated On : August 27, 2024 2:21 pm

Singer chinmai

Follow us on

Singer Chinmai : చిత్ర పరిశ్రమలో గతంలో మీటూ ఆరోపణలు చేసినందుకు తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సింగర్ చిన్మయ చెప్పుకొచ్చింద. జీవనోపాధిని కోల్పోవడంతో పాటు ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు చెప్పింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు కేరళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలను హేమ కమిటీ నివేదిక బాహ్య ప్రపంచానికి అందించడంపై ఆమె స్పందించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక హింసకు గురైన ఎంతో మంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకునేందుకు హేమ కమిటీ ప్రోత్సాహం అందించినట్లయ్యిందని పేర్కొంది. సిద్ధిక్, రంజిత్ మాత్రమే కాదు.. ఎంతో మంది నటీమణులను వేధిస్తూనే ఉన్నారు. ఇక వారందరి జీవితాలు బయటకు వస్తాయి అంటూ ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఈ కమిటీ నివేదిక మాలీవుడ్ లో నేర సంబంధమైన విధానాలను బయటకు తెచ్చింది. సీనియర్ నటులు, దర్శకుల ఆగడాలను బయటకు చెప్పుకునేందుకు ఫిర్యాదుల పెట్టెను తెరిచినట్లయ్యింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన కేరళలోని నటీమణులను ఆమె అభినందించింది. పరిశ్రమలో ఇలాంటి హింసకు గురైన మిగతవారు కూడా ధైర్యంగా బయటకు రావాలని ఆమె పిలుపునిచ్చింది. కాగా ఈ కమిటీ నివేదిక తర్వాత దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్, నటుడు సిద్ధిక్, కేరళ చలనచిత్ర అకాడమీ , అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)లో తమ పదవులకు రాజీనామా చేశారు. సోమవారం మరో జూనియర్ నటి కూడా నటుడు, దర్శకుడైన బాబూరాజ్ పై ఆరోపణలు చేశారు. తనపై లైంగిక దాడి చేశాడని పేర్కొంది. ప్రస్తుతం మళయాల సినీనటుల సంఘం, అమ్మ జాయింట్ సెక్రటరీగా ఉన్న బాబురాజ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ ఆరోపణలను ఖండించారు. ఇక వీటిపై చిన్మయ మాట్లాడుతూ ఈ నేరాలను రుజువు చేయడంలో భాగంగా జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి ఉంటుందన్నారు.

గేయ రచయిత వైరముత్తు, నటుడు రాధా రవిపై ఆమె గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తాను డబ్బింగ్ నుంచి నిషేధించబడ్డానని, వృత్తి ఎదుగుదలలో చాలా కోల్పోయానని చెప్పుకొచ్చారు. తన సొంత అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకుంది. న్యాయవ్యవస్థ చర్యలు తీసుకునే అవశ్యకతను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తాను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, తన ఫిర్యాదులను వారు బుట్టదాఖలు చేయడం లాంటి వివరాలను ఆమె పేర్కొంది.
ఇదే ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పుకోవడంలో వెనుకబాటుకు కారణమని చెప్పింది. అయితే ఈ కేసుల్లో చాలా వరకు సందర్భోచిత సాక్ష్యాలే ఉంటాయి. గాయాలు కూడా కొద్ది రోజుల్లోనే మాయమవుతాయి అంటూ స్పందించింది.

ఇక ఇలాంటి నేరాల్లో వేగవంతమైన న్యాయవ్యవస్థ అవసరం. మేము అన్నివేళలా అవమానాలను భరించలేం. న్యాయం చేస్తామని చెప్పి ఐసీసీని తెచ్చారు. కానీ దాని పని అది చేయట్లేదు. ఇక జాతీయ మహిళా కమిషన్ పనితీరు మరింత దారుణంగా ఉంది. ఎంతో ఆశించాం.. కానీ ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ పేర్కొంది. ఇక ముఖ్యంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. వారికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం. సినీ, రాజకీయ రంగాల్లోనూ ఈ వేధింపులు ఉన్నాయి.

కానీ మన నాయకులకు ఇవన్నీ పట్టవు. ఇక అన్ని వ్యవస్థలు బాధితుల తరఫున మాట్లాడవు. అందుకే బాధితులు బయటకు రారు.. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రశంసంచింది. కేరళలో నటీమణులకు ఇది మంచి అవకాశమని, వారికి జరిగిన అన్యాయంపై గొంతెత్తాలని పిలుపునిచ్చింది.