Allu Arjun : ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని రెండు వర్గాలు ఉండేవి కాదు. మెగా, అల్లు ఫ్యామిలీస్ ని కలిపి మెగా ఫ్యామిలీ అనేవారు. కానీ ఇప్పుడు రెండు వర్గాలుగా విభజించాలని అల్లు అర్జున్ గత కొంతకాలంగా తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. ఒక స్టార్ హీరో స్థానంలో ఉంటూ ఎలాంటి కారణం లేకుండా అభిమానుల మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం ఎవరూ చెయ్యకూడదు. కానీ అల్లు అర్జున్ అలా రిపీట్ చేస్తూ పోతున్నాడు. చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను అవమానిస్తూ, వాళ్ళని రెచ్చగొడుతూ గొడవలకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఆ సమస్య సర్దుకుంది, మళ్ళీ అందరూ బాగున్నారు అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ గొడవలకు దారి తీసాడు. ఎన్నికల సమయంలో మన ఆంధ్ర ప్రదేశ్ ఎంత వాడివేడి వాతావరణంలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అలాంటి సమయంలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్లగా, అల్లు అర్జున్ వైసీపీ పార్టీ లో ఉన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికోసం వెళ్ళాడు. అక్కడితో గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి, అల్లు అర్జున్ మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు అతన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాతావరణం మాములు స్థితికి వచ్చింది. కానీ నిన్న అల్లు అర్జున్ నాకు నచ్చినట్టు నేనుంటా అంటూ మాట్లాడిన మాటలు, చల్లారిపోయిన గొడవల్ని మళ్ళీ తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇలా తన మీద ఉన్న కోపాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు మర్చిపోయే కొద్దీ రెచ్చగొట్టిమరీ తన మీద నెగిటివిటీ ని పెంచుకుంటున్నాడు అల్లు అర్జున్. ఎందుకు ఇదంతా..?, దగ్గర్లో ‘పుష్ప: ది రూల్’ చిత్రం ఉంది, ఆ సినిమాతో నేను మెగా కంటే పెద్ద హీరో ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనే సందేహం అందరిలో నెలకొంది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గతం లో నా తండ్రి అల్లు అరవింద్ కంటే చిరంజీవి అంటేనే ఇష్టం అనేవాడు. ఇప్పుడు చిరంజీవి మీద కూడా ఇష్టం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నేడు ఉదయం 7 గంటలకు ఆయన చిరంజీవి కి ఎదో మొక్కుబడిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్టుగా అభిమానులకు అనిపించింది. ఆ ట్వీట్ లో ఎలాంటి ఆప్యాయత లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అంటూ దేవర చిత్రం లోని డైలాగ్ ని కూడా అదనంగా జతపరిచి ట్వీట్స్ వేసేవాడు.
బంధుత్వం లేని వ్యక్తికి మాత్రం ఎనలేని ప్రేమ చూపించి, ఆయన ఎదిగేందుకు కారణమైన చిరంజీవి , పవన్ కళ్యాణ్ ని మాత్రం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా వదిలించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు అందరికీ అర్థం అవుతుంది. మెగా అభిమాని అనేటోడు చిన్నప్పటి నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత ఉత్సాహంగా టిక్కెట్లు తెంపేవారో, అల్లు అర్జున్ కి కూడా అదే విధంగా తెంపేవారు. ఇప్పుడు వాళ్లకి కూడా ఆయన సమాధానం చెప్పేందుకు ఇష్టపడడం లేదు, మనిషిలో ఒక్క విజయం ఇంతలా మార్చేస్తుందా అని చెప్పడానికి అల్లు అర్జున్ ఒక ఉదాహరణగా మిగిలిపోయాడు.