Hero Gopichnad: యాక్షన్ డైరెక్టర్ అంటే బోయపాటి శ్రీను గుర్తుకు వస్తారు. కానీ.. నిజానికి ఈ తరం మొదటి యాక్షన్ డైరెక్టర్ మాత్రం దర్శకుడు ‘హరి’ మాత్రమే. దర్శకుడు హరి కి టాలీవుడ్ కలసిరాలేదు. ఇక్కడ నేరుగా సినిమాలు చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఏ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. బాలయ్యతో కుదిరింది అనుకునే లోపే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీనికి తోడు హరి తమిళంలో చేసిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.

ఐతే తెలుగు హీరోలకు దర్శకుడు హరి పై నమ్మకం పోలేదు. ఇంకా ‘సింగం సిరీస్’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చే సత్తా హరి లో వుంది. బాలయ్య తో గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిపారు హరి. ఐతే అది వర్క్ అవుట్ కాలేదు. తాజా సమాచారం ఏమిటంటే.. రవితేజ తో హరి టచ్ లో వున్నారని తెలిసింది. కాకపోతే, రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

అందుకే ఈ లోపు ఒక సినిమా చేసుకుని వస్తాను అని హరి హీరో గోపీచంద్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే, హరి తన కథని గోపీచంద్ కి చెప్పారు. గోపీచంద్ కి కూడా కథ నచ్చింది. కాంబినేషన్ ఫైనల్ అయ్యింది. గోపీచంద్ కి మాస్ ఇమేజ్ వుంది. హరి కథ గోపీచంద్ ఇమేజ్ కి కూడా పక్కాగా సరిపొతుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Kalyan Ram Bimbisara Trailer: నందమూరి వైవిధ్యమైన హీరోకి ఈ సారి భారీ హిట్ పడేలా ఉందే
దర్శకుడు హరి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మా కాంబినేషన్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఐతే, మా సినిమా ఆలస్యమైనా, పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా చేస్తాం. గోపీచంద్ క్రేజ్ రెట్టింపు అవుతుంది. ఆ స్థాయిలో మా సినిమా ఉంటుంది’ అంటూ హరి చెప్పుకొచ్చాడు.
ఏది ఏమైనా మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా దర్శకుడు హరికి మంచి పేరు ఉంది. హీరో సూర్యతో ఆయన తీసిన ‘సింగం’ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సిరిస్ కి తెలుగులో కూడా బాగా ఆకట్టుకుంది. అందుకే.. హరి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు.
Also Read: Adire Abhi- Anasuya Bharadwaj: అనసూయ పై అదిరే అభి షాకింగ్ కామెంట్స్
[…] […]