Pakka Commercial Collections: ఫమార్కెట్ లేని హీరో.. వయసు అయిపోయిన హీరోయిన్ ఒక్కటే

Pakka Commercial Collections: ‘పక్కా కమర్షియల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే సినిమాకు ఎందుకు కలెక్షన్స్ రావడం లేదన్నదే సినిమా సర్కిళ్లలో భయంకరమైన ప్రశ్నగా వుంది. దానికి తోడు ఈ రోజు, రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు లేవు. గట్టిగా పది శాతం టికెట్ లు తెగడం లేదు. ఈ రోజు అయితే మరీ దారుణంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయినా ‘పక్కా కమర్షియల్’ […]

Written By: Shiva, Updated On : July 6, 2022 10:43 am
Follow us on

Pakka Commercial Collections: ‘పక్కా కమర్షియల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే సినిమాకు ఎందుకు కలెక్షన్స్ రావడం లేదన్నదే సినిమా సర్కిళ్లలో భయంకరమైన ప్రశ్నగా వుంది. దానికి తోడు ఈ రోజు, రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు లేవు. గట్టిగా పది శాతం టికెట్ లు తెగడం లేదు. ఈ రోజు అయితే మరీ దారుణంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

gopichand

అయినా ‘పక్కా కమర్షియల్’ బుకింగ్ లు జోరందుకోలేదు. గోపీచంద్ నటించిన గత రెండు సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. అవి కూడా బాక్సాఫీస్ వద్ద బతకలేకపోయాయి అన్నది అంగీకరించాల్సిన వాస్తవం. నిజానికి కరోనాకి ముందు నుంచే గోపీచంద్ మార్కెట్ పడిపోయింది. లౌక్యం తర్వాత ఆయనకు చెప్పుకోతగ్గ హిట్ లేదు. సిటీమార్ మంచి సినిమా కానీ ప్రాఫిటబుల్ సినిమా కాదు.

Also Read: Adire Abhi- Anasuya Bharadwaj: అనసూయ పై అదిరే అభి షాకింగ్ కామెంట్స్

సిటీమార్ కి కూడా కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాదు, లాభాల్లో వాటా అని ముందు అనుకున్నా, హీరో గోపీచంద్ కి రెమ్యూనిరేషన్ మేరకు అదనంగా ఇవ్వాల్సి వచ్చింది. అందుకే సిటీమార్ నిర్మాత చాలా నష్టపోయారు. ఇప్పుడు గోపీచంద్ కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మార్కెట్ లేని హీరో.. వయసు అయిపోయిన హీరోయిన్ ఒక్కటే.

పాపం గోపీచంద్.. పక్కా కమర్షియల్ తోనైనా కాస్త ఊపిరి పీల్చుకుంటాడు అనుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పక్కా కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే. ఎందుకంటే ఇది కూడా ప్లాప్ అయితే.. గోపీచంద్ కి ఉన్న ఆ కాస్త మార్కెట్ కూడా పూర్తిగా పోతుంది. కానీ పక్కా కమర్షియల్ ప్లాప్ చిత్రంగానే నిలిచింది. పైగా నలభై కోట్ల భారీ బడ్జెట్.

gopichand

ఇప్పటికే ఈ ప్రాజెక్టు కలెక్షన్స్ మీద కొంత మల్లగుల్లాలు నడుస్తున్నాయి. పక్కా కమర్షియల్ ఆంధ్ర ఏరియాను (సీడెడ్ కాకుండా) 11 కోట్ల రేంజ్ లో అమ్మారు. కానీ ఇంకా 5 కోట్లు రాలేదు. ఇప్పుడు 11 కోట్ల ఫీట్ ను దాటేలా పక్కా కమర్షియల్ కి ఊపు లేదు. మొత్తానికి గోపీచంద్ రేంజ్ ఈ సినిమాతో బాగా పడిపోయింది.

Also Read:Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత: ఇది అందం అంటే

Tags