Saif Ali Khan: బాలీవుడ్ నటుడు(Bolly wood Actar) సైఫ్ అలీఖాన్‌పై గురువారం(జనవరి 16న) రాత్రి 2 గంటల సమయంలో ముంబై(Mumbai)లోని అతని ఇంట్లోనే దాడి జరిగింది. ఇద్దరు దుండగులు అత్యంత భద్రత కలిగిన సైఫ్ ఇంట్లో చొరబడి దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముంబై పోలీసులు.. పలు కోణాల్లో విచారణ జరిపారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా ఇద్దరు దుండగులు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు గుర్తించారు. ఒక నిందితుడిని మరుసటి రోజే పట్టుకున్నారు. అయితే మరో నిందితుడు మాత్రం పారిపోయాడు. అతడి కోసం ముంబై పోలీసు ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా గాలిస్తున్నాయి. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం అతడిని విచారణ చేస్తున్నారు. అయితే ఇతను నిందితుడా కాదా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్..
సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన మరో వ్యక్తి ఆకాశ్ కైలాష్ కన్నోజియా(31)గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్(Chathiesgadh)లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై–హౌరా ఎక్స్‌ప్రనెస్‌లో దుర్గ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆకాశ్‌ను శనివారం మధ్యాహన 2 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ పోలీసలు తెలిపారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి కోసం ముంబై పోలీసులు దుర్గ్(Durg)కు బయల్దేరారు.
కత్తితో పొడిచి..
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని బాంద్రాలో ఉన్న అతని నివాసంలోనే దాడి జరిగింది. ఇంట్లో చోరీకి వచ్చిన దుండగుడు ఆ సమయంలో సైఫ్ మేల్కొని దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే దొంగ కత్తితో దాడిచేసి సైఫ్‌ను తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతోపాటు శరీరంపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతని తనయుడు ఇ బ్రహీం అలీఖాన్(Ibrahim ali khan) తన తండ్రిని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వెన్నెముక భాగంలో పొడవడంతో అందులోని ఫ్లూయిడ్ లీక్ అయిందని తెలిపారు. దానిని సరిచేశామని, వెన్నెముకలో విరిగిన కత్తి ముక్కను కూడా బయటకు తీశామని తెలిపారు. సైఫ్ మెడ, చేతులపై ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సెఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.