Cancer: ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల యువత ఎక్కువగా అనారోగ్య సమస్యల (Health Issues) బారిన పడుతున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలా మంది ప్రమాదకరమైన క్యాన్సర్ (Cancer) బారిన పడుతున్నారు. ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ప్రస్తుతం యువత పాటించే ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. రోజురోజుకీ క్యాన్సర్ (Cancer) యువతకు ప్రాణాంతకంగా మారుతుంది. పూర్వం రోజుల్లో ఆరోగ్యమైన జీవనశైలి ఉండేది. కానీ ప్రస్తుతం అంతా కూడా అనారోగ్యమైన జీవనశైలి ఉంటుంది. పోషకాలు లేని ఫుడ్ తినడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, అనారోగ్యం వంటి సమస్యల వల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే చిన్న వయస్సులోనే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అసలు ప్రస్తుతం యువత ఎందుకు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు? క్యాన్సర్ ఎందుకు యువతకు ప్రాణంతాకంగా మారుతుంది? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధూమపానం
ప్రస్తుతం యువత మద్యం, ధూమపానం వంటి వాటికి బాగా అలవాటు పడ్డారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ధూమపానం కాల్చడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, నోరు, గొంతు, క్లోమం, మూత్రాశయం, గర్భాశయం, మూత్రపిండాల వంటి క్యాన్సర్‌కు ఈ ధూమపానం కారణమవుతుంది. ఎక్కువగా ధూమపానం కాల్చడం వల్ల ప్యాంక్రియాటిక్, గొంతు, నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసిన కూడా కొందరు సిగరెట్ తాగుతుంటారు. ఈ ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
పోషకాలు లేని ఆహారం తీసుకోవడం
చాలా మంది పోషకాలు లేని ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తింటారు. వీటివల్ల క్యాన్సర్ వచ్చే సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీన్స్, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర, మసాలా అధికంగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కాస్త తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కువగా వీరిలోనే..
క్యాన్సర్ ఎక్కువగా యువతలోనే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీరిలో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి బారిన పడుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.