Foods: ఈ ప్రపంచంలో అందరికీ అన్ని నచ్చాలని రూల్ లేదు. ఒక్కోరి ఇష్టం ఒక్కోలా ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు కొందరి ఫేవరెట్ (favourite) అయితే మరికొందరికి అవి నచ్చవు. అయితే ఎక్కువ శాతం మందికి నచ్చని కొన్ని ఆహార పదార్థాలు (foods) కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు తిన్నా కూడా ఆ ఆహార పదార్థాలు నచ్చవు. ఆరోగ్యానికి ఆ ఆహార పదార్థాలు మంచివే అయినప్పటికీ కొందరికి నచ్చవు. అయితే ఎక్కువ శాతం మందికి నచ్చని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పుట్టగొడుగులు
ఇప్పుడంటే అంతా హైబ్రిడ్‌గా తయారు చేస్తున్నారు. కానీ సాధారణంగానే పుట్ట గొడుగులు పుడుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే ఎక్కువ శాతం మందికి పుట్టగొడుగులు నచ్చవట. వీటిని తిన్నప్పుడు చాలా మెత్తగా, డిఫరెంట్‌గా ఉంటాయని కొందరు భావిస్తారు. అందుకే వీటిని తినడానికి పెద్దగా ఇష్టపెట్టుకోరు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి.
ఆంకోవీస్
ఆంకోవీస్ ఎక్కువగా యూనైటెడ్ స్టేట్స్‌లో లభిస్తుంది. అయితే వీటిని తినడానికి చాలా మంది పెద్దగా ఇష్టపెట్టుకోరు. వీటిని తినడం వల్ల డిఫరెంట్ వాసన వస్తుందని కొందరు భావిస్తారు. అందుకే పెద్దగా వీటిని తినడానికి ఇష్టం చూపించరు.
స్వీట్ బ్రెడ్‌లు
ఎక్కువ శాతం మందికి స్వీట్ బ్రెడ్‌లు అంతగా నచ్చవట. ఇవి తినడానికి చాలా ఎక్కువ తీపి ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని కొందరు వీటిని తినడానికి పెద్దగా ఇష్టపెట్టుకోరు.
బ్లూ చీజ్
బ్లూ చీజ్ వాసన, రుచి అంతగా ఎవరికి నచ్చవు. దీన్ని చూస్తే బూజుపట్టినట్లు కనిపిస్తుంది. సాధారణంగా చీజ్ అంటే ఇష్టపడతారు. కానీ బ్లూ చీజ్‌ను ఎవరూ కూడా పెద్దగా ఇష్టపెట్టుకోరు.
కొత్తిమీర
ఆరోగ్యానికి మేలు చేసే కొత్తిమీర వాసన కొందరికి నచ్చదు. ఈ వాసన వల్ల కొందరికి వాంతులు అవుతాయి. దీంతో పూర్తిగా తినడం మానేస్తారు. కొత్తిమీరను వంటల్లో వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి. కానీ కొందరు వీటిని తినడానికి పెద్దగా ఇష్టపెట్టుకోరు.
బెండకాయ
బెండకాయ కూర చాలా మందికి ఇష్టం ఉంటుందని భావిస్తారు. కానీ బెండకాయ అంటే చాలా మందికి నచ్చదట. ఎందుకంటే దీన్ని వండినప్పుడు తెమడలా వస్తుందని చాలా మంది తినడానికి పెద్దగా ఇష్టం చూపించరు. అయితే బెండకాయను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని అంటుంటారు. అందుకే చిన్న పిల్లలకు ఎక్కువగా దొండకాయకు బదులు బెండకాయను ఇస్తుంటారు. మరి మీకు కూడా ఈ ఆహారాలు ఇష్టమో లేదో కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.