https://oktelugu.com/

Suresh Babu: తెలుగు రాష్ట్రాలకు నెంబర్ వన్ హీరో అతనే..ప్రభాస్ కూడా అతని తర్వాతే : నిర్మాత సురేష్ బాబు

నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలను అందించిన ఆయన, రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఎవరు ఓపెనింగ్స్ లో కింగ్ అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ 'మన తెలుగు లో పవన్ కళ్యాణ్ కి అందరికంటే ఎక్కువ ఓపెనింగ్స్ స్టామినా ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 03:44 PM IST

    Suresh Babu

    Follow us on

    Suresh Babu: అభిమానులకు తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రికార్డ్స్ ఎంతో ప్రత్యేకం. వాళ్ళు వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు. ఒక్కోసారి నిర్మాతలు అభిమానుల ఒత్తిడి ని భరించలేక వాళ్ళ కోసం వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ బయట చెప్పడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో 200 కోట్ల గ్రాస్ పోస్టర్లు, 500 కోట్ల గ్రాస్ పోస్టర్లు చాలా సాధారణంగానే కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు మాత్రమే కాదు, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈమధ్య ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఎన్ని పోస్టర్లు వేసుకున్నా, అభిమానుల కోసం ఎన్ని రికార్డ్స్ ని ప్రచురితం చేసినా, సదరు హీరో తదుపరి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి ఆ హీరో స్థాయి ఏమిటి అనేది మార్కెట్ లో ట్రేడ్ కి అర్థం అయిపోతుంది. అలా ట్రేడ్ ని దశాబ్దాలుగా దగ్గర నుండి పరిశీలిస్తున్న వారిలో ఒకరు దగ్గుబాటి సురేష్ బాబు.

    నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలను అందించిన ఆయన, రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఎవరు ఓపెనింగ్స్ లో కింగ్ అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మన తెలుగు లో పవన్ కళ్యాణ్ కి అందరికంటే ఎక్కువ ఓపెనింగ్స్ స్టామినా ఉంది. ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారికి ఓపెనింగ్స్ స్టామినా ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని మించిన స్టార్ హీరో లేరు. ఆయన చిన్న డైరెక్టర్ తో సినిమా తీసినా కూడా ఓపెనింగ్స్ వస్తాయి, అదే పెద్ద స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే మనం ఊహించడానికి కూడా కష్టం, అలాంటి వసూళ్లు వస్తాయి. కాబట్టి ఆయనే నా దృష్టిలో నెంబర్ 1 హీరో’ అంటూ చెప్పుకొచ్చాడు. సురేష్ బాబు మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    సురేష్ బాబు చెప్పిన మాటలను ట్రేడ్ లో ఉన్న ప్రతీ ఒక్కరు ఏకీభవిస్తారు. ఉదాహరణకు వకీల్ సాబ్ చిత్రాన్ని తీసుకోండి. ఈ సినిమా విడుదల సమయంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత దారుణంగా ఉండేది. పైగా అమ్ముడుపోయిన బెన్ఫిట్ షోస్ అన్ని ప్రభుత్వం అప్పటికప్పుడు జీవోని జారీ చేసి రద్దు చేసింది. ఎలాంటి స్పెషల్ షోస్ లేకుండా, ఈ చిత్రం కేవలం రెగ్యులర్ షోస్ నుండి 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం విడుదల అవుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు బెన్ఫిట్ షోస్, స్పెషల్ షోస్, భారీ స్థాయిలో టికెట్ రేట్స్ పెంచినా ఈ స్థాయి వసూళ్లు రావడం లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలాంటి ఓపెనింగ్స్ పెట్టడం చిన్న విషయం కాదు. అందుకే ఆయన ‘బ్రో’ చిత్రం లో సపోర్టు రోల్ చెప్పినప్పటికీ విడుదలకు ముందు ఆ సినిమా వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.