https://oktelugu.com/

Tirumala Laddu Issue : తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు తీర్పు.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదీ.. వైసీపీ నుంచి రోజా మొదలెట్టింది

తిరుమలలో వివాదం గత కొద్దిరోజులుగా సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగింది. దీనికి చెక్ చెబుతూ ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీలో పాలక, ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి.

Written By:
  • Dharma
  • , Updated On : October 4, 2024 / 03:47 PM IST

    Tirumala Laddu Issue

    Follow us on

    Tirumala Laddu Issue :  తిరుమలలో వివాదం పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ నాయకత్వంలో.. సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు, ఆహార కల్తీ నియంత్రణ శేఖర్ నుంచి ఒకరు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ వివాదాన్ని రాజకీయ అంశంగా చూడొద్దని.. దీనిపై వ్యాఖ్యానాలు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం నిర్ణయం పై సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. లడ్డు వివాదం పై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని సుబ్రహ్మణ్యస్వామి, వై వి సుబ్బారెడ్డి, మరికొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణకు వచ్చిన సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ నిలిచిపోయింది. కేంద్రం అభిప్రాయం కోరగా.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుకుంటున్నట్లు సులిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టుకు విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. దీనిని స్వాగతించారు చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.సత్యమేవ జయతే..నమో వెంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

    * స్వాగతించిన రోజా
    వైసీపీ నుంచి తొలిసారిగా మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆహ్వానించారు. సుప్రీంకోర్టు తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో… రాజకీయ దురుద్దేశం పూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదన్నారు.సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారని.. అదే సీఎం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయా?అని ప్రశ్నించారు. అందుకే వైసిపి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుకున్నట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే చెప్పిందన్నారు.సుప్రీం పర్యవేక్షణలో జరిగే స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు రోజా.

    * కొద్దిసేపట్లో మీడియా ముందుకు జగన్
    కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి ఈ ఘటన జరిగిన తర్వాత వైసిపి కార్నర్ అయ్యింది. ఆత్మరక్షణలో పడింది.సీఎం చంద్రబాబు తో పాటు కూటమి ప్రభుత్వంపై వైసీపీ విరుచుకుపడింది.జగన్ చంద్రబాబుపాప ప్రక్షాళన కోసం తిరుమల వెళ్లి పూజలు చేస్తానని కూడా ప్రకటించారు.కానీ డిక్లరేషన్ అంశం తెరపైకి రావడం,ప్రభుత్వం వైసిపి హడావిడి పై అనేక ఆంక్షలు విధించడంతో వెనక్కి తగ్గారు. దీంతో వైసిపి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ప్రచారం సాగింది. సరిగ్గా అదే సమయంలో సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో వైసిపి ఊపిరి పీల్చుకుంది.ఇప్పుడు కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కూడిన ప్రత్యేక సిట్ ఏర్పాటుపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.