Siddharth: హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటించిన బొమ్మరిల్లు సినిమా ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు ఈ హీరో. ఆ తర్వాత నువ్వస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని స్టార్ హీరోల లిస్ట్ లో చేరారు. కానీ ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. అందరు అనుకున్నట్టుగా ఈయన కిస్మత్ మాత్రం మరో విధంగా మలుపు తిరిగింది.
బొమ్మరిల్లు సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాను, సిద్దార్థ్ ను ఎవరు మర్చిపోలేదు. ఆ తర్వాత ఓయ్, ఓ మై ఫ్రెండ్ సినిమాలు కూడా మంచి పేరు సంపాదించి పెట్టాయి. అయితే సినిమాల పరంగా మంచి పేరు సంపాదించినా సిద్ధూ.. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. 2003వ సంవత్సరంలోనే తన పక్కింట్లో ఉండే మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు.
పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే వీరి మధ్య మనస్పర్థలు, విబేధాలు వచ్చాయి. దీంతో 2007లో వివాహ బంధానికి స్వస్తి పలికారు ఈ జంట. అప్పటికే ఈ ఇద్దరికి మొగ్లీ అనే బాబు పుట్టాడు. ఆ తర్వాత కొడుకు సంరక్షణను తండ్రే తీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోలేదు.
ఇక సమంతతోనూ సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారం నడిపారు. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. గుడులు గోపురాలు తిరిగారు. జాతకాలు కలవలేదో.. మరేదైనా సమస్యనో కానీ.. వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకూ చేరలేదు.
ప్రస్తుతం హీరోయిన్ అదితిరావు హైదరీతో సిద్ధార్థ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కనిపించని సిద్ధూ మళ్లీ వెండితెరపై మెరుస్తున్నాడు. ప్రస్తుతం సిద్దార్థ్ మహాసముద్రం అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం చేసుకున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ పంచుకున్నారు.