90s Web Series Review: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు తెర పైన మనల్ని మనం చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు ఒక సినిమాని మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీస్తే మాత్రం ఆ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది.ఇప్పటి వరకు అలా చాలా సినిమాలు అలా వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. అయితే ఈ రోజు కూడా కొన్ని సున్నితమైన భావోద్వేగాలను మనకు తెలియజేయడానికి శివాజీ మెయిన్ లీడ్ లో వచ్చిన 90స్ (నైంటీస్) అనే వెబ్ సిరీస్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే చాలా రోజుల తర్వాత శివాజీ మళ్ళీ శివాజీ నటించడం మంచి విజయం అనే చెప్పాలి.అయితే శివాజీ ఇంతకుముందు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో పలు రకాలుగా సేవలను అందించాడు. అయితే ఈ సిరీస్ తో మరొకసారి తను కంబ్యాక్ అయితే ఇచ్చాడు మరి ఈ సీరీస్ ఎలా ఉంది ఈ సీరీస్ తో మళ్ళీ శివాజీ ఫుల్ టైమ్ నటుడిగా మారిబోతున్నాడా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక ముందుగా ఈ స్టోరీ విషయానికి వస్తే చంద్రశేఖర్ (శివాజీ) అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక భార్య రాణి (వాసుకి)అలాగే ఆదిత్య, రఘు, దివ్య అనే ముగ్గురు పిల్లలు ఉంటారు.అయితే చంద్ర శేఖర్ వాళ్ల బాగోగులు వాళ్ళు చూసుకుంటూ తన పని తను చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అయితే చంద్రశేఖర్ తను గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన పిల్లల్ని మాత్రం ప్రైవేటు స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. ఆదిత్య చదువుల్లో కొంచెం డల్ స్టూడెంట్ గా ఉంటాడు. కానీ రఘు, దివ్య మాత్రం చాలా బాగా చదువుతూ ఉంటారు ఇక ఇదే క్రమంలో రఘు కి పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అందరూ అనుకుంటారు. మరి అతనికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందా రాలేదా..? రఘు క్లాస్ మేట్ అయిన సుచిత్ర అతనికి ఫ్రెండ్ అవుతుందా లేదా..? అలాగే ఆదిత్య చదువులో మెరుగుపడ్డాడా లేదా..? చంద్రశేఖర్ తన ఫ్యామిలీని సక్రమంగా చూసుకున్నాడా లేదా అనే విషయాలు క్లారిటీగా తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే…
ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సీరీస్ ని తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 90స్ నాటి ప్రతి మూమెంట్ ని రీ క్రియేట్ చేయడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ సినిమాని ఆధ్యాంతం ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండే విధంగా నడిపించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కానీ కథ మనకు తెలిసిన కథ కావడం అలాగే తర్వాత సీన్ ఏం జరుగుతుందో మనం ముందుగానే పసిగట్టడం లాంటివి ఆ సినిమాకి కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక శివాజీ తన నటనతో మెప్పిస్తాడు అలాగే తన భార్యగా చేసిన వాసుకి కూడా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే ఈ సీరీస్ అధ్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది, ఏడిపిస్తుంది ఆ పాత్రల్లో మనల్ని మనకు చూపిస్తుంది. ఇక కొన్ని సీన్లలో అయితే ప్రేక్షకులు కంటతడి కూడా పెట్టుకుంటారు అలా సున్నితమైన భావాలని చాలా రియలేసస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక దర్శకుడు ఒక మంచి అటెంప్ట్ చేయడమే కాకుండా తను చేసిన ఆ అటెంప్ట్ లో 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…సురేష్ బొబ్బిలి ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు బాగుంది…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో చేసిన శివాజీ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళ కెరియర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ గా ఇవి ఎప్పుడు చరిత్రలో మిగిలిపోతాయంటూ చెప్పడం లో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ పాత్రలను వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనేంతలా జీవించేసారు. ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేశారు. ఇక వీళ్ళిద్దరికీ కూడా తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక పిల్లలు కూడా చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్లకున్న పరిధిని దాటకుండా చాలా బాగా నటించారు…
ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సీరీస్ కి సురేష్ బోబ్బిలి అందించిన మ్యూజిక్ కొంతవరకు బాగున్నప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగుండుంటే సీన్ లలో ఉన్న ఇంపాక్ట్ అనేది మరింత ఎలివేట్ అయ్యేది. అందువల్ల కొన్ని సీన్లు అక్కడక్కడ డౌన్ అయినట్టుగా అనిపించింది. ఇక విజువల్స్ పరంగా కూడా ఈ సీరీస్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజువల్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే సీరీస్ కి ఎక్ అయితే కావాలో అవన్నీ కూడా సమకూరుస్తు కరెక్ట్ గా ఎంత బడ్జెట్ అయితే కావాలో అంత బడ్జెట్ ని కేటాయించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ సిరీస్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
శివాజీ, వాసుకి ల నటన
కొన్ని కామెడీ సీన్లు
ప్రొడక్షన్ వాల్యూస్
డైరెక్షన్
ఇక ఈ సిరీస్ లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే
కథ, స్క్రీన్ ప్లే
కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి…
ఇక ఈ సిరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5