https://oktelugu.com/

Game Changer Trailer: ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లో హైదరాబాద్ PVR థియేటర్స్ కూలిపోవడం చూసారా..? సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని దాచారో!

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో 'హైడ్రా' అనే ప్రభుత్వ అనుసంధాన సంస్థ అక్రమ కట్టడాలను కూల్చివేయడం వంటివి మనం చాలానే చూసాము. అవి నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్స్ అయ్యాయి కూడా. 'గేమ్ చేంజర్' ట్రైలర్ లో మనం బాగా గమనిస్తే ఒక అందమైన కట్టడాన్ని కూల్చివేసే సన్నివేశం కనిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 08:06 PM IST

    Game Changer Trailer(6)

    Follow us on

    Game Changer Trailer: డిసెంబర్ 22 వ తారీఖున డల్లాస్ లో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని సన్నివేశాలు చూస్తే ప్రస్తుతం రాజీకాయల్లో చోటు చేసుకున్న మార్పులన్నీ కనిపిస్తాయి. కానీ శంకర్ ఇవి నాలుగు సంవత్సరాల ముందు ఊహించి రాసారు. ఆయన ఎలా అయితే రాశాడో, అవే ఇప్పుడు జరుగుతున్నాయి’ అంటూ ఒక మాట చెప్తాడు. గేమ్ చేంజర్ ట్రైలర్ ని చూస్తే ఆయన చెప్పింది నిజమే అని అనిపించక తప్పదు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ‘హైడ్రా’ అనే ప్రభుత్వ అనుసంధాన సంస్థ అక్రమ కట్టడాలను కూల్చివేయడం వంటివి మనం చాలానే చూసాము. అవి నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్స్ అయ్యాయి కూడా. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లో మనం బాగా గమనిస్తే ఒక అందమైన కట్టడాన్ని కూల్చివేసే సన్నివేశం కనిపిస్తుంది.

    ఇది హైడ్రా ని ఉద్దేశించి తీసినవే అని చెప్పొచ్చు. అయితే ట్రైలర్ లో కూల్చివేయబడుతున్న బిల్డింగ్ పై AVR అని రాసి ఉంది. అంటే ఇది PVR సినిమాస్ ని ఉద్దేశించి తీసిన సన్నివేశామా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి. అంత అవసరం శంకర్ కి ఏమి ఉంది?, PVR సంస్థతో ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఆలోచించే దాకా వెళ్లిపోయారు నెటిజెన్స్. మరి AVR అనేది సినిమాలోని రాజకీయ నాయకుడికి సంబంధించిందా?, లేకపోతే నిజంగానే PVR పై పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ చేసిందా అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సింది. అదే విధంగా ట్రైలర్ ప్రారంభం లో అక్రమ బియ్యం ని రవాణా చేసే వాళ్ళని అడ్డుకుంటున్నట్టు చూపించారు. ఇది పవన్ కళ్యాణ్ ‘సీజ్ ది షిప్’ ఘటన ని గుర్తు చేస్తుంది. ఇలా ఎన్నో సన్నివేశాలను మనం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సందర్భలతో పోల్చి చూసుకునేలా ఉన్నాయి.

    కానీ ఈ సన్నివేశాలు మొత్తం శంకర్ ప్రస్తుత రాజకీయాలను కాపీ కొడుతూ చేయలేదు. ఏడాది క్రితమే వీటిని చిత్రీకరించాడు. ఇంత అడ్వాన్స్ గా ఆలోచించే శంకర్ తీరుకి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే ముందు ఆయన అనేక నిజాయితీ గల రాజకీయ నాయకులను బాగా పరిశీలించాడట. తమిళనాడు లో ఒక IAS ఆఫీసర్ ఇలాగే రాజకీయ నాయకులకు భయపడకుండా చాలా నిజాయితీగా డ్యూటీ చేసి, ఇప్పుడు అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఆయన ప్రేరణతో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రాసుకున్నాడట శంకర్. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ నేడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ని చూస్తే చాలా రిచ్ గా ఉంది, కేవలం పాటల కోసమే టికెట్స్ కొనేయొచ్చు, అంత అద్భుతమైన క్వాలిటీ తో చిత్రీకరించాడు డైరెక్టర్ శంకర్. మరో 8 రోజుల్లో ఆడియన్స్ కి థియేటర్స్ లో కనుల పండుగ జరగనుంది, చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలాంటిది అనేది.