https://oktelugu.com/

Game Changer Trailer: ఇందాకే కొన్ని సన్నివేశాలు చూసాను..తొడ కొట్టాలి అనిపించింది..’గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు!

ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ని, మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిధులుగా పిలవాలని ప్లాన్ చేసారు. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా AMB సినిమాస్ లో కేవలం మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈవెంట్ ని చేసారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 08:15 PM IST

    Game Changer Trailer(7)

    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో వారం రోజుల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. ముందుగా ఈ ట్రైలర్ ని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ని, మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిధులుగా పిలవాలని ప్లాన్ చేసారు. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా AMB సినిమాస్ లో కేవలం మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈవెంట్ ని చేసారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

    అయితే ఈ చిత్రం పట్ల మొదటి నుండి చాలా నమ్మకం తో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడింది చాలా తక్కువే కానీ, అభిమానులు చొక్కాలు చింపుకునే రేంజ్ లోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒక తమిళ సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి, ఒక తెలుగు సినిమాని గ్లోబల్ సినిమాగా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరుపున కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీరు మాకు ఒక దారిని చూపిస్తున్నారు. శంకర్ గారు మొదలు పెట్టారు, ఇప్పుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్ కి తీసుకెళ్లి, మాలాంటోళ్ళకి ఇలాంటి సినిమా తీస్తే బౌండరీలు బ్లాస్ట్ అవుతాయి అనే నమ్మకాన్ని ఇచ్చారు మీరిద్దరూ. గేమ్ చేంజర్ గురించి మాట్లాడాల్సి వస్తే, డల్లాస్ ఈవెంట్ లోనే చాలా మాట్లాడాను, నాల్గవ తేదీ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొన్ని మాటలు దాచుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా అయన మాట్లాడుతూ ‘శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్ చూపిస్తూ వెళ్తున్నాం. పాటల్లో ఆ గ్రాండియర్ ని మీరంతా లిరికల్ వీడియో సాంగ్స్ లో 50 శాతం మాత్రమే చూసారు. 10 వ తేదీన ఈ సినిమా ఔట్పుట్ ని చూసి మీరంతా షాక్ అవుతారు. నిన్ననే తమన్ ప్రసాద్ ల్యాబ్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ, నన్ను రమ్మంటే వెళ్ళాను. రెండు రీల్స్ చూపించాడు, అవి చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడ కొట్టాలి అనిపించింది. మళ్ళీ ఓవర్ అయిపొతుందెమో అని ఆగిపోయాను’ అంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన మాటలను చూసిన తర్వాత అభిమానుల్లో ఉన్నటువంటి నమ్మకం పదింతలు పెరిగింది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎంతో ఆనందంతో సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.