https://oktelugu.com/

MP Chamala Kiran Kumar Reddy: అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి అందుకే అరెస్ట్ చేయించాడట.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్ ఎంపీ

అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విమర్శలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ సీఎం పేరుతో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ను అరెస్టు చేయించారని కూడా కొందరు చెప్పారు.

Written By:
  • Rocky
  • , Updated On : January 2, 2025 / 07:44 PM IST

    MP Chamala Kiran Kumar Reddy

    Follow us on

    MP Chamala Kiran Kumar Reddy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన చిట్ చాట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతికి పాల్పడి అందరికీ తెలిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరికీ తెలిశారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్టు వివాదం ఎంత సంచలనంగా మారింతో మనందరికీ తెలుసు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఈ ఘటనలోనే ఆమె కుమారుడు గాయపడి ఆసుపత్రి పాలైన తర్వాత ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇందులో అల్లు అర్జున్ A11 నిందితుడు. కేసు దర్యాప్తులో భాగంగా, డిసెంబర్ 11న పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఆ రాత్రి అతడిని జైలుకు తరలించారు. మరుసటి రోజు అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యారు. కోర్టు అతనికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతను ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాడు.

    అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విమర్శలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ సీఎం పేరుతో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ను అరెస్టు చేయించారని కూడా కొందరు చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి తనకు ఎవరిపైనా పక్షపాతం లేదని, చట్ట ప్రకారం నడుచుకున్నానని అసెంబ్లీలో వివరించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    అల్లు అర్జున్ కామెంట్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అల్లు అర్జున్ కామెంట్లను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో విడుదల చేశారు. ఒకవైపు ప్రభుత్వం… మరోవైపు అల్లు అర్జున్ ఈ విషయాన్ని రక్తి కట్టిస్తూ వచ్చారు. ఇది ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇది ఎక్కడికో వెళ్తుందని కొందరు అనుమానించారు. అందుకే ఇటీవల ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ దిల్ రాజు, సినీ ప్రముఖులందరినీ సీఎం రేవంత్ ముందు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండూ తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. దీంతో రెండు వర్గాల మధ్య అంతరం తగ్గినట్లు అనిపించింది. అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. అల్లు అర్జున్ బెయిల్‌ను వ్యతిరేకించడానికి పీపీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించారు.. పోలీసులను నిందించారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. వీటి ద్వారా అల్లు అర్జున్ బెయిల్‌ను రద్దు చేయాలి.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయకూడదు. కానీ పీపీ అలా చేయలేదు. కేసును వాయిదా వేయాలని వారు అభ్యర్థించారు. దీని ఆధారంగా, అల్లు అర్జున్ విషయంలో పోలీసులు/ప్రభుత్వం కొంచెం నెమ్మదిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.