https://oktelugu.com/

Arjun Younger Daughter: హీరో అర్జున్ చిన్న కూతురిని చూశారా? పక్కా హీరోయిన్ మెటీరియల్, వైరల్ ఫోటోలు!

అనంతరం ప్రేమ బరహా టైటిల్ తో కన్నడ చిత్రంలో నటించింది. విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కాల్సి ఉంది.

Written By: , Updated On : April 19, 2024 / 03:39 PM IST
Arjun younger Daughter Viral Pics

Arjun younger Daughter Viral Pics

Follow us on

Arjun Younger Daughter: 90లలో స్టార్ హీరో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశాడు అర్జున్ సర్జా. యాక్షన్ హీరోగా పేరున్న అర్జున్ కి మూడు భాషల్లో మార్కెట్ ఉండేది. కర్ణాటకకు చెందినవాడైనప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో కూడా ఆయన సినిమాలు ఆడేవి. స్టార్డమ్ తగ్గాక అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కొన్ని చిత్రాల్లో విలన్ రోల్స్ కూడా చేశాడు. అర్జున్ సర్జాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ఐశ్వర్య సర్జా. ఈమె హీరోయిన్ గా మారింది. విశాల్ కి జంటగా పాట్టత్తు యానై టైటిల్ తో తమిళ చిత్రం చేసింది. ఇది ఆమె డెబ్యూ మూవీ.

అనంతరం ప్రేమ బరహా టైటిల్ తో కన్నడ చిత్రంలో నటించింది. విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కాల్సి ఉంది. అందులో ఐశ్వర్య సర్జా హీరోయిన్. అర్జున్-విశ్వక్ సేన్ మధ్య వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఐశ్వర్య సర్జా హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ఆమె పెళ్ళికి సిద్ధమైంది. నటుడు తంబీ రామయ్య కొడుకు ఉమాపతితో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది.

కాగా అర్జున్ చిన్న కుమార్తె కూడా పాప్యులర్. సోషల్ మీడియాలో ఆమె యాక్టీవ్. ఈమె పేరు అంజనా సర్జా. ఆంజనేయ స్వామి భక్తుడైన అర్జున్ కూతురుకి అంజనా అని పేరు పెట్టుకున్నాడు. అక్క మాదిరి అంజనా హీరోయిన్ కాలేదు. అయితే హీరోయిన్స్ వలె ఇంస్టాగ్రామ్ లో ఫోటో షూట్స్ చేస్తుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. అంజనా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

అంజనా ఈ మధ్య ఓ హ్యాండ్ బ్యాగ్స్ కంపెనీ స్టార్ట్ చేసినట్లు సమాచారం. చూస్తుంటే అంజనా బిజినెస్ ఉమన్ ఎదగాలని ఆశపడుతున్నట్లు ఉంది. అర్జున్ సర్జా తన ఇద్దరు కుమార్తెలను వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తున్నాడు. కాగా గత ఏడాది లియో మూవీలో అర్జున్ కీలక రోల్ చేశాడు. విజయ్ హీరోగా నటించిన లియో భారీ వసూళ్లు రాబట్టింది. తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అర్జున్ బిజీగా ఉన్నారు.