Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్లు.. కారణం ఏంటంటే..?

ఆ స్టోరీ తోనే రామ్ చరణ్ ను హీరోగా పెట్టి సుకుమార్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక వంశీ పైడిపల్లి కూడా విజయ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలయితే చేశాడు.

Written By: Gopi, Updated On : April 19, 2024 3:31 pm

Star Directors giving hand Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్న విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయనకి వరుస ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఈయనతో సినిమా చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు విజయ్ ని పట్టించుకోవడం లేదు. సుకుమార్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశాడు.

కానీ ఆ సినిమా క్యాన్సల్ అయింది. ఇక ఆ స్టోరీ తోనే రామ్ చరణ్ ను హీరోగా పెట్టి సుకుమార్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక వంశీ పైడిపల్లి కూడా విజయ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలయితే చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా లేటైనట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి అటు స్టార్ డైరెక్టర్లు పట్టించుకోక, ఇటు మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేయలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు.

మరి ఈయన కి ఇప్పుడు హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అనే దాని మీదనే చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక పరుశురాం డైరెక్షన్ లో చేసిన “ఫ్యామిలీ స్టార్” సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు. కాబట్టి ఇక మీదట ఈయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

లేకపోతే మాత్రం ఈయన కెరియర్ అనేది చాలా తొందరగా ముగిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మరొక సినిమాకు అయితే కమిట్ అవలేదు. మరి ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి కథలను ఎంచుకొని ముందుకు సాగుతాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…