https://oktelugu.com/

RRR Karma Siddhantam: ఆర్ఆర్ఆర్’లో ఈ కర్మ సిద్దాంతాన్ని గమనించారా?

దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి మదిలో నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రిలీజ్ అయిప్పుడు కొంత మంది పట్టించుకోలేదు. కానీ సినిమాలోని సీన్స్ వాల్యూస్ ను తెలిపాయని చెప్పడంతో చాలా మంది దీనిని చూసేందుకు అసక్తి చూపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 12, 2023 11:46 am
    RRR Karma Siddhantam

    RRR Karma Siddhantam

    Follow us on

    RRR Karma Siddhantam: జీవితంలో సుఖమయ జీవితం గడపడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు మిగతా వారికంటే ఉన్నతంగా జీవించాలనే ఉద్దేశంతో తెలిసి, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ప్రతీ తప్పుకు శిక్ష తప్పకుండా ఉంటుంది. మీరు చేసే తప్పులన్నీ చిత్ర గుప్తుడు లెక్కలన్నీ రాస్తుంటాడు.. అనే డైలాగ్స్ చాలా సినిమాల్లో చూశాం.. పెద్దలు చెబుతుంటే విన్నాం. అయితే వీటిని చాలా మంది కొట్టిపారేస్తారు. కానీ ‘కర్మ’ సిద్ధాంతం ప్రకారం మనం ఎలాంటి తప్పు చేస్తే అలాంటి శిక్షే పడుతుందని చెబుతుంది. ఈ అనుభవం చాలా మందికి ఎదురైనా గుర్తించలేకపోతున్నారు. దీంతో తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ విషయాన్ని రాజమౌళి తన ‘RRR’ సినిమాలో చూపించారు. దాని గురించి తెలుసుకుందాం..

    దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి మదిలో నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రిలీజ్ అయిప్పుడు కొంత మంది పట్టించుకోలేదు. కానీ సినిమాలోని సీన్స్ వాల్యూస్ ను తెలిపాయని చెప్పడంతో చాలా మంది దీనిని చూసేందుకు అసక్తి చూపారు. అంతేకాకుండా పాన్ వరల్డ్ లెవల్లో సినిమాను ఆదరించడంతో ఆస్కార్ వేదికపైకి ఎక్కి అవార్డును తీసుకొచ్చింది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా టీవీల్లో వస్తే చూడకుండా ఉండలేరు. అయితే ఇందులో ఓ సీన్ ను కర్మసిద్ధాంతం ప్రకారమే పెట్టారని ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

    ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరన్, ఎన్టీఆర్ లు నటించారు. ఒకరు అల్లూరి రామరాజుగా, మరొకరు కొమురం భీం పాత్రలో నటించారు. అల్లూరి రామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ బ్రిటిష్ వారి వద్ద పోలీసుగా ఉంటాడు. ఈ సమయంలో భీం తన స్నేహితుడితో కలిసి పట్టణానికి వస్తాడు. ఈ క్రమంలో భీం స్నేహితుడు లచ్చు (రాహుల్ రామకృష్ణ)పై రామరాజు అక్రమంగా చొరబడ్డాడనే నేపథ్యంలో కొడుతుంటాడు. ముఖ్యంగా అతని మొకాళ్లపైనే ఎక్కువగా కొడుతాడు.

    ఆ తరువాత రామరాజు గురించి తెలిసిన తరువాత బ్రిటిష్ వాళ్లు అతనిపై దాడి చేస్తారు. ఈ క్రమంల రామరాజు మొకాళ్లపైనే ఎక్కువగా కొడుతారు. అంటే అప్పుడు లచ్చుపై మొకాళ్లపై దాడి చేసిన క్రమంలో ఇప్పుడు రామరాజు అదే శిక్షను అనుభవిస్తాడన్నమాట. ఇది రాజమౌళి ఆలోచించి పెట్టారో.. యాదృశ్చికంగా అలా జరిగిందో తెలియదు గానీ..ఇది కర్మ సిద్ధాంత ప్రకారమే అని కొందరు అంటున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.