Homeఎంటర్టైన్మెంట్Mogali Rekulu Sagar’s Wife: మొగలి రేకులు సాగర్ వైఫ్ ని ఎప్పుడైనా చూశారా? అందంలో...

Mogali Rekulu Sagar’s Wife: మొగలి రేకులు సాగర్ వైఫ్ ని ఎప్పుడైనా చూశారా? అందంలో హీరోయిన్స్ సరిపోరు!

Mogali Rekulu Sagar’s Wife: సీరియల్ హీరోల్లో స్టార్ స్టేటస్ అనుభవించాడు సాగర్. ఆయన లీడ్ రోల్స్ చేసిన చక్రవాకం, మొగలిరేకులు భారీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా మొగలిరేకులు సీరియల్ సాగర్ కి విపరీతమైన ఫేమ్ తెచ్చింది.

సీరియల్ హీరోల్లో స్టార్ స్టేటస్ అనుభవించాడు సాగర్. ఆయన లీడ్ రోల్స్ చేసిన చక్రవాకం, మొగలిరేకులు భారీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా మొగలిరేకులు సీరియల్ సాగర్ కి విపరీతమైన ఫేమ్ తెచ్చింది. ఈ సీరియల్ లో సాగర్ మూడు పాత్రలు చేశాడు. ఆర్ కే నాయుడు, మున్నా, మహీధర్ నాయుడు పాత్రల్లో అలరించాడు. మొగలిరేకులు సీరియల్ తో సాగర్ కి మహిళల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. సీరియల్ హీరోగా మారక ముందు సాగర్ సిల్వర్ స్క్రీన్ పై ప్రయత్నాలు చేశాడు. మనసంతా నువ్వే చిత్రంలో చిన్న పాత్రలో మెరిశాడు.

Also Read:వచ్చే వారం ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!

సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో సీరియల్ హీరోగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. మొగలిరేకులు సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో సాగర్ కి అవకాశం వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ చిత్రంలో సాగర్ ది సెకండ్ లీడ్ అని చెప్పి దర్శకుడు దశరధ్ ఒప్పించాడట. తీరా చూస్తే ఎలాంటి ప్రాధాన్యత లేని హీరో ఫ్రెండ్ రోల్ ఇచ్చారట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ చేసి తప్పు చేశానని, ఆ మూవీ తన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపిందని సాగర్ ఆవేదన చెందారు. అనంతరం సిద్ధార్థ్ మూవీలో హీరోగా మారాడు సాగర్. ఆ సినిమా ఆడలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ తో మరో చిత్రం చేశాడు. అది కూడా నిరాశపరిచింది.

అయితే షాదీ ముబారక్ మూవీతో హిట్ అందుకున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన షాదీ ముబారక్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సాగర్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. గ్యాప్ తీసుకున్న సాగర్ ది 100 టైటిల్ ఓ చిత్రం చేశాడు. ఈ మూవీలో ఆయన పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది 100 మూవీ ట్రైలర్ విడుదల చేయడం విశేషం. జులై 11న ది 100 థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో సాగర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read:మహేష్ బాబు,రాజమౌళి చిత్రానికి సరికొత్త చిక్కులు..ఇలా అయితే కష్టమే!

సాగర్ భార్య పేరు సౌందర్య కాగా.. గతంలో ఆమె డిజిటల్ మీడియా కంపెనీ నడిపారట. పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకుందట. ప్రస్తుతం ఆత్మన్ ది లేబుల్ పేరుతో గార్మెంట్ బ్రాండ్ రన్ చేస్తుందట. ఇక సాగర్ సతీమణి అందంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు. ఆమె ఇంస్టాగ్రామ్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

RELATED ARTICLES

Most Popular