N Convention : “ఒకవేళ నేను చెరువు మధ్యలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించి ఉంటే.. విచారణలో నాది తప్పని తేలితే.. కచ్చితంగా నేనే దానిని పడగొట్టేవాడిని.. కనీసం నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వకుండా కబ్జా చేసినట్టు ప్రకటించారు. కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేశారు” హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత నాగార్జున స్పందన ఇది.. కనీసం నోటీసు ఇవ్వలేదని అతడు రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
తప్పు భావన కలుగుతోంది
నాగార్జున స్పందన తర్వాత హైడ్రా తప్పు చేసింది అనే భావన కలుగుతోంది. దీంతో ప్రభుత్వం న్యాయపరంగా ఇరకాటంలో పడినట్టు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే హఠాత్తుగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత మీద స్టే ఇచ్చింది. అది అందేలోపే ఆ ఫంక్షన్ హాల్ కూలిపోయింది. ఇప్పుడిక నాగార్జున న్యాయపరంగా ముందుకు వెళ్తాడా? దీనిపై కోర్టు విచారణ నిర్వహిస్తుందా? నాగార్జున ఆధీనంలో ఉందని చెప్తున్న మూడున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నవుతున్నాయి. మరోవైపు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను సామాజికవేత్తలు సమర్థిస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి ఆ కూల్చివేతకు వ్యతిరేకంగానే స్పందించింది.. కొంతకాలంగా కేసీఆర్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆ పార్టీ నడుచుకుంటుంది. అందువల్లే పార్లమెంట్ ఎన్నికల్లో జనం సున్నా ఇచ్చారు. ఆయన కూడా ఆ పార్టీ ధోరణి ఏ మాత్రం మారడం లేదు..
భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే
భారత రాష్ట్ర సమితి వ్యవహార శైలి అలా ఉంటే.. భారతీయ జనతా పార్టీ మరో విధంగా స్పందిస్తోంది. బిజెపి మెదక్ ఎంపీ, న్యాయవాది అయిన రఘునందన్ రావు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సరికాదని చెబుతున్నాడు..” ఇలా స్పందించడం సబ్ జూడీస్ కాదు. నీటి వనరులను ఆక్రమిస్తే నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను పడగొట్టాలని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పట్లో భారత రాష్ట్ర సమితి కూడా నాగార్జున మూడున్నర ఎకరాలు ఆక్రమించినట్టు గుర్తించింది. నోటీసులు కూడా జారీ చేసింది. అప్పట్లో హైకోర్టు చెబితేనే కదా సర్వే చేసింది.. ఆక్రమణ అని తేల్చింది.. హైదరాబాదులో నీటి వనరుల తక్షణ కోసం జీవో నెంబర్ 157 తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు కోటి చెబితేనే ఆ జీవో తెరపైకి వచ్చింది. మళ్లీ ఈ కూల్చివేత మీద స్టే ఇవ్వడం దేనికి.. హైకోర్టు అనుమతిస్తే నేను వచ్చి నా వాదనలు వినిపిస్తానని” రఘునందన్ రావు వ్యాఖ్యానించాడు.
ఆగమేఘాల మీద ఇవ్వలేదు
ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో గత న్యాయపరమైన చరిత్ర చూడకుండా, కోర్టులు ఇచ్చిన తీర్పులు చూడకుండా హైడ్రా అధికారులు ఆగమేఘాల మీద దానిని కూల్చివేశారు అని చెప్పడానికి లేదు. పైగా నాగార్జున సినిమా ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్. తెలుగు సినిమా వ్యాపారాన్ని శాసిస్తున్న వ్యక్తుల్లో అతడు ఒకడు. ఎన్ కన్వెన్షన్ అనేది వందల కోట్ల ప్రాపర్టీ.. దాన్ని అతడు అంత ఈజీగా ఎందుకు వదులుకుంటాడు.. పైగా లీగల్ గా ప్రొసీడ్ కాకుండా ఉంటాడు అని అనుకోవడానికి లేదు. గతంలోనే భారత రాష్ట్ర సమితి బుల్డోజర్లు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీదికి వెళ్లాయి. తర్వాత వెనక్కి వచ్చాయి. అయితే ఆ అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించిందనేది బహిరంగ రహస్యమే. రైతుల రుణాల మాఫీకి సంబంధించి కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఊపిరి ఆడకుండా చేస్తున్న భారత రాష్ట్ర సమితిని.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఒక్కసారిగా డిఫెన్స్ లో పడేసింది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి ఆయాచితమైన బలం ఇచ్చింది.
అంతా న్యాయపరంగానే జరిగిందట..
ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందని భారత రాష్ట్ర సమితి చెబుతోంది. కానీ ఆ మాట పూర్తిగా అబద్ధం. గతంలోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు తీర్పులు ఇచ్చింది. క్రమబద్ధీకరణకు నాగార్జున అప్పట్లో ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ ప్రభుత్వం దానిని తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తి న్యాయబద్ధంగా చేసామని హైడ్రా బాధ్యతలు చూస్తున్న రంగనాథ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.. అంటే నాగార్జున ఖండించిన తీరు జనాలను వెర్రివాళ్ళను చేయడం కాకపోతే మరి ఏమిటి? అప్పట్లో 111 జీవో ను గత ఏడాది భారత రాష్ట్ర సమితి బొంద పెట్టింది. దాన్ని ఔన్నత్యాన్ని ధ్వంసం చేసింది. దానికి బదులుగా కొత్త జీవో ఏదో తెచ్చామని చెప్పింది గాని.. దాని పరిస్థితి ఏమిటో ఇప్పటికే తెలియదు.. రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని సమర్థిస్తుంటే.. కిషన్ రెడ్డి మాత్రం హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టాడు.. హైడ్రా అనేది ఒక డ్రామా అని తేల్చి పడేశాడు. ఏమో ఈ బీజేపీలో ఎవరు ఎలా మాట్లాడుతారో.. ఎవరు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఎప్పటికీ తెలియదు.