Vivek Agnihotri: రీసెంట్ గా వచ్చిన సినిమాలలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మూవీ ఓకే ఒక్కటి. అదే కశ్మీర్ ఫైల్స్. డైరెక్టర్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. కశ్మీర్ పండిట్స్ ఊచకోత నేపథ్యంలో సాగిన ఈ కథ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ మూవీని ప్రధాని స్వయంగా మెచ్చుకోవడం.. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయిస్తూ ప్రోత్సహించడంతో పాటు.. ఉద్యోగులకు సెలవులు కూడా ఇవ్వడం ఎంత సంచలనం రేపిందో మనం చూశాం.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. దీంతో డైరెక్టర్ మరో సినిమా చేస్తానంటూ గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించడం సంచలనం రేపింది. తన తర్వాత సినిమా ఢిల్లీ ఫైల్స్ అంటూ చెప్పారు. ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో సిక్కులపై ఊచకోతను చూపించబోతున్నారు.
Also Read: Nityamenen: నిత్యామీనన్ ను చలివేంద్రంతో పోల్చిన ప్రముఖ సింగర్.. ఏం జరిగిందంటే?
కాగా ఆయన ప్రకటనను ఆప్ పార్టీ స్వాగతించింది. అటు కాంగ్రెస్ కూడా నిజాలను చూపించాలంటూ కోరింది. అయితే ఈ సినిమా కూడా బీజేపీ స్ట్రాటజీ ప్రకారమే అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. గతంలో తీసిన కశ్మీర్ ఫైల్స్ బిజీపీకి అనుకూలంగానే ఉంది. ఇప్పుడు తీయబోయే ఢిల్లీ ఫైల్స్ మూవీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది అంటూ కొందరు చెబుతున్నారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన సంస్థలే ఈ సినిమాకు పని చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఇంకెన్ని వివాదాలు రాజుకుంటాయో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కశ్మీర్ ఫైల్స్ కు పట్టిన సమయం కంటే ఈ మూవీకి తక్కువ టైం పడుతుంది. దాంతో ఇప్పటి నుంచి ఈ మూవీ కోసం చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.