Sobhita And Naga Chaitanya: ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధ ఘటన ఇండస్ట్రీ లో పెద్ద టాక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ స్థాయి మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ గా రిపబ్లిక్ అనే పాపులర్ నేషనల్ మీడియా నాగ చైతన్య,శోభిత నిశ్చితార్థం గురించి రాసిన ఒక కథనం సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగ చైతన్య తల్లి పేరు లక్ష్మి దగ్గుబాటి. ఈమె స్వయానా విక్టరీ వెంకటేష్ కి సోదరి అవుతుంది అనే విషయం తెలియని వారంటూ ఉండరు. పెద్దల పరస్పర అంగీకారంతో అప్పట్లో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. కానీ అనుకోకుండా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత లక్ష్మి నాగ చైతన్య తో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఇదంతా పక్కన పెడితే దగ్గుపాటి లక్ష్మి కి సమంత- నాగచైతన్య జంట అంటే చాలా ఇష్టం.
సమంత ని ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడి తన కోడలిగా అంగీకరించింది. ఆమెతో నాగ చైతన్య విడిపోవడం లక్ష్మి కి అసలు ఇష్టం లేదని, అందుకే మొన్న జరిగిన నిశ్చితార్థం కి లక్ష్మి తో పాటు దగ్గుపాటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ రాలేదని రిపబ్లిక్ మీడియా కథనం యొక్క సారాంశం. సమంత తో విడిపోయిన తర్వాత దగ్గుబాటి లక్ష్మి నాగ చైతన్య తో మాట్లాడడం బాగా తగ్గించేసింది అట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమంత ఇప్పటికీ కూడా లక్ష్మి తో మాట్లాడుతుందట. సమంతకి మయోసిటిస్ వ్యాధి సోకినప్పుడు లక్ష్మి ఎంతో బాధపడిందని, ఆమె బాగోగులు గురించి ఎప్పటికప్పుడు కాల్ చేసి కనుక్కుంటూ ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది.
అయితే సమంత తో వైవాహిక బంధం ఉన్న సమయంలోనే నాగ చైతన్య శోభిత తో రహస్య సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయం వల్లే వాళ్లిద్దరూ విడిపోయారని సోషల్ మీడియా లో ఉన్న ఆధారాలతో ఖరారు చేసుకోవచ్చు. నాగ చైతన్య తల్లికి ఇవన్నీ తెలుసు కాబట్టే ఇప్పుడు ఆమె కొడుకుకి దూరంగా, మాజీ కోడలికి దగ్గరగా ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇకపోతే ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం పెళ్లి ఎక్కడ జరిపించాలి అనే దానిపై ఇరు కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. డిసెంబర్ నెలలో వీళ్లిద్దరి వివాహం జరిగే అవకాశం ఉంది. కనీసం పెళ్ళికి అయినా నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి వస్తుందా లేదా అనేది చూడాలి. ఏ కొడుకుకి అయినా కన్నతల్లి ఆశీర్వాదం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి కి తల్లి ఆశీర్వాదం లేకపోతే, ఆ పెళ్ళికి అర్థం లేనట్టే. మరి నాగ చైతన్య పెళ్ళికి ఆమె వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.ఒకవేళ రాకపోతే మీడియా లో ప్రచారం అవుతున్న కథలు నిజమే అనడానికి బలం చేకూరుతుంది.