Sunil Konugolu  : వైసిపి వ్యూహకర్తగా ఆయన.. జగన్ భారీ ఆఫర్.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

ఇప్పుడు రాజకీయాల్లో వ్యూహకర్తలకు మంచి డిమాండ్. వారికి భారీ ఆఫర్ ఇచ్చి తమ వైపు తిప్పుకుంటున్నాయి పార్టీలు. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతో సేవలందించడం లేదు.

Written By: Dharma, Updated On : August 23, 2024 2:45 pm

Sunil Konugolu-YS Jagan

Follow us on

Sunil Konugolu : వైసీపీకి ఐ ప్యాక్ టీం సేవలందిస్తోందా? లేకుంటే ప్యాకప్ చెప్పేశారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర అంశం. 2014లో వైసిపి ప్రతిపక్షానికి పరిమితం అయింది.67 స్థానాలతో పటిష్ట పరిస్థితుల్లోనే ఉండేది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీం సేవలను వినియోగించుకోవడం ప్రారంభించారు జగన్. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ కిషోర్ విశేష సేవలు అందించారు. నాటి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలను కుల మత వర్గాలుగా విభజించి జగన్ వైపు టర్న్ అయ్యేలా చేశారు.2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం కూటమికి సహకారం అందించారు పీకే. ఎన్నికల్లో జగన్ కు దారుణ ఓటమి తప్పదని కూడా ముందుగానే జోక్యం చెప్పారు. పరిస్థితి అలానే మారింది. జగన్ కు దారుణ పరాజయం ఎదురయింది.

* పీకే అనంతరం రుషిరాజ్ సింగ్
ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన సమకాలీకుడు రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐ ప్యాక్ టీం సేవలందించడం ప్రారంభించింది. గత ఐదేళ్లుగా వైసీపీకి రాజకీయ వ్యూహకర్త బృందంగా పనిచేసింది. కానీ ఓటమి ఎదురైంది. దీంతో ఐప్యాక్ టీంకు జగన్ ప్యాకప్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఓటమి తర్వాత ఐ ప్యాక్ టీం ఎక్కడ కనిపించడం లేదు. వారి కార్యాలయం సైతం ఖాళీ అయినట్లు తెలుస్తోంది.

* ఐ ప్యాక్ ను వదిలించుకున్నారా?
అయితే ఇప్పుడు పార్టీ ప్రక్షాళన పై జగన్ దృష్టి పెట్టారు. నమ్మకమైన నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి లకు ప్రధాన కార్యదర్శి పదవులు అప్పగించారు. వారి ద్వారా పార్టీని నడపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఐ ప్యాక్ టీం ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఐప్యాక్ టీమ్ ను వదిలించుకున్నారని.. కొత్త టీం ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారని ప్రచారం సాగుతోంది.

* ఆయన కోసం గట్టిగానే ప్రయత్నం
జగన్ మదిలో సునీల్ కొనుగోలు ఉన్నారని ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కొనుగోలు సేవలు అందిస్తున్నారు. ఈయన సైతం ప్రశాంత్ కిషోర్ కు సమకాలీకుడు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. అధికారంలోకి తీసుకు రాగలిగారు. తెలంగాణలో సైతం మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో వ్యూహకర్త సునీల్ కొనుగోలు పాత్ర ఉంది. ఇప్పుడు ఆయనకు భారీగా ఆఫర్ చేసి.. వ్యూహకర్తగా తేవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సేవలు అందిస్తున్న సునీల్ కొనుగోలు అందుకు అంగీకరిస్తారా? లేదా? చూడాలి.