Ram Charan: రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు వేరు. ఆర్ ఆర్ ఆర్ తో ఆయనకు గ్లోబల్ ఫేమ్ వచ్చిపడింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలవగా రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అక్కడి ప్రముఖ మీడియా ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూల కోసం వెంటబడ్డాయి. అంతర్జాతీయ అవార్డులు రామ్ చరణ్ ని వరించాయి. ఇక ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
మెగా-నందమూరి హీరోలు చరణ్-ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనూహ్య పరిణామం. ఆర్ ఆర్ ఆర్ తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన రామ్ చరణ్ కి ఆచార్య రూపంలో చేదు అనుభవం ఎదురైంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. రామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటించింది.
ఈ క్రమంలో రామ్ చరణ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం.
గేమ్ ఛేంజర్ అనంతరం దర్శకుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మూవీకి రామ్ చరణ్ కమిట్ అయ్యాడు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ని యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. మీకు థ్రిల్లర్స్ ఇష్టమా కామెడీ ఇష్టమా? అనే కామెడీ అని రామ్ చరణ్ చెప్పాడు.
భవిష్యత్ లో కామెడీ మూవీ చేసే అవకాశం ఉందా? అని అడగ్గా… తప్పకుండా అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తో చేసేది కామెడీ మూవీ అని చెప్పి ఆశ్చర్యపరిచారు. మాస్ ఇమేజ్ కలిగిన రామ్ చరణ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ చేసే అవకాశం లేదు. కాబట్టి బుచ్చిబాబు మూవీలో రామ్ చరణ్ పాత్ర మేజర్ గా కామెడీ యాంగిల్ లో సాగుతుందేమో అనిపిస్తుంది. రంగస్థలం మూవీలో చిట్టిబాబుగా కొన్ని సన్నివేశాల్లో రామ్ చరణ్ అద్భుతమైన కామెడీ పంచారు.