https://oktelugu.com/

South Vs Bollywood: సౌత్ vs బాలీవుడ్ సినిమాల మధ్య పోటీ పెరిగిపోయిందా..? దీనికి కారణం ఎవరు..?

సౌత్ సినిమాలకి బాలీవుడ్ సినిమాలకి మధ్య చాలా రోజుల నుంచి ఒక మినీ యుద్ధం అయితే నడుస్తుంది. ఒకరిని ఒకరు డామినేట్ చేసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 21, 2024 / 03:24 PM IST

    South Vs Bollywood

    Follow us on

    South Vs Bollywood: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలు అంటూ తేడా చూపిస్తూ వచ్చేవారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ సినిమాలు అంటే అసలు నచ్చేది కాదు. మన సినిమాల్లో అసలు మ్యాటర్ ఉండేది కాదని సౌత్ సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్లు,ఆరు పాటలు, మూడు కుళ్ళు జోకులు అంతే వాళ్లకి మంచి కథలు రాసే సత్తా లేదు అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీ పైన బాలీవుడ్ వాళ్ళు విపరీతంగా కామెంట్లు చేసేవారు… కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. సౌత్ సినిమా ఇండస్ట్రీ హవా మొదలైంది. గొప్ప కథలను రాసి చాలా గొప్ప గా సినిమాలను తీసే దర్శకులు, బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే హీరోలు ముందుకు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఏం చేయలేక ఇప్పుడు సౌత్ సినిమాలు చేసే మ్యాజిక్ ను చూస్తూ కూర్చుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళను వాళ్ళు నిరూపించుకునే సమయం వస్తుంది. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం కదా అని పక్కవాళ్ల పైన అనవసరమైన కామెంట్లు చేయడం, వాళ్లతో ఏమీ అవ్వదు అని విర్రవీగిపోవడం చాలా తప్పు…ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది. ఆ వచ్చిన రోజు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు… గత కొన్ని రోజుల నుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఆనేంతలా మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశ్యంతో జనాలు పని కట్టుకొని మరి తెలుగు సినిమాల మీద విమర్శలు చేస్తున్నారు. ఇక సౌత్ సినిమా అంటే తెలుగు సినిమానే అంటూ బాలీవుడ్ వాళ్లు కామెంట్లు చేయడంతో మిగతా సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమా మీద ద్వేషాన్ని పెంచుకోవాలనే బాలీవుడ్ ప్లాన్స్ వేస్తున్నారు.

    కానీ సౌత్ సినిమా అంటే తమిళ్, మలయాళ, కన్నడ అన్ని భాషలను కలిపి వచ్చే సినిమా అనే క్లారిటీ మనందరికీ ఉంది. కాబట్టి సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పై చేయి సాధించాలనే ఉద్దేశ్యం తో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ గా ఉన్నాడు. అంటూ బాలీవుడ్ కి చెందిన అర్షద్ వార్నీ కొన్ని కామెంట్లైతే చేశారు.దీనితో అర్షద్ మీద పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కౌంటర్లు వేస్తున్నారు…అలాగే రీసెంట్ గా కాంతర సినిమాలో నటించిన రిషభ్ శెట్టి మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు దేశ గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి అంటూ కామెంట్లు చేశాడు.

    దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రిషబ్ శెట్టి పైన ట్రోల్ చేస్తున్నారు. ఏదో నేషనల్ అవార్డు కూడా వచ్చిందని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు అంటూ అతనిపైన అసభ్య పదజాలం వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అసలు కాంతర సినిమాకు నేషనల్ అవార్డు రావాల్సిన అంత గొప్ప సినిమా ఏం కాదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

    ఇక ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబచ్చన్ షారుక్ ఖాన్ లాంటి గొప్ప నటులందరూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే మనందరం అంటూ అందరినీ కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ వస్తున్నప్పటికీ అవి ఎప్పటికప్పుడు గొడవలు మాత్రం ఆగడం లేదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనే నినాదాన్ని హీరోలు ముందుకు తీసుకెళ్తున్నారు…