https://oktelugu.com/

Ben Affleck-Jennifer Lopez Divers :  మరో సినీ జంట డైవర్స్.. ఐదో భర్తకు బ్రేకప్ చెప్పిన స్టార్ నటిమణి..

హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ సినీ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బంధానికి ఇక ముగింపు పలకాలని అనుకుంటూ విడాకుల పిటిషన్ దరఖాస్తు చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 / 03:12 PM IST

    Ben Affleck-Jennifer Lopez Divers

    Follow us on

    Ben Affleck-Jennifer Lopez Divers : హాలీవుడ్ జంట బెన్ అప్లెక్స్-జెన్నీఫర్ లోపేజ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల వివాహ బంధానికి వారు ముగింపు పలకబోతున్నారు. లాస్ ఏంజెల్స్ లోని కౌంటీ న్యాయస్థానంలో వారు విడాకుల దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జెన్నిఫర్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. కాగా వీరిద్దరూ లాస్ వెగాస్ లో 2022లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2002 నుంచి పరిచయం ఉంది. తర్వాత 20 ఏండ్లకు వీరు పెండ్లి ద్వారా ఏకమయ్యారు. ఇక జెన్నిఫర్ ఇలా బ్రేకప్ చెప్పడం ఇది ఐదోసారి. బెన్ కు ఇది మూడోసారి. జెన్నిఫర్ గతంలో ఓజానీ, మార్క్ అంథోని, క్రిస్ జూడ్ తో బ్రేకప్ చెప్పింది. ఇక బెన్ తో ఇది రెండోసారి. అయితే ప్రస్తుతం విడాకుల కోసం జెన్నీ కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల దాంపత్య జీవితానికి జెన్నీ, బెన్ జంట ఇక ముగింపు పలికినట్లేనని అభిమానులు బాధ పడుతున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని సన్నిహితులు చెబుతున్నారు. వీరు విడాకులు ఖాయమని ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ జెన్నిఫర్ కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. లాస్ ఏంజిల్స్ కోర్టులో దంపతులిద్దరూ తమ ఆర్థిక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, రుణాల వివరాలు పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. తుది తీర్పు వెల్లడించేలోగా ఈ వివరాలు కోర్టులో సబ్ మిట్ చేయాలి. కాగా భర్త బెన్ నుంచి జెన్ని పెద్ద ఎత్తున భరణం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, 150 మిలియన్ డాలర్ల ఆస్తిలో సగం వాటా కావాలని జెన్నిఫర్ అడుగుతున్నట్లు ఒక వార్తపత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్ లోని ఖరీదైన బంగ్లా లో ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఈ భవనాన్ని కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం.

    జెన్నిఫర్ లోపేజ్ ఆస్తి 400 మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని సమాచారం. ఇండియా కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 3వేల కోట్ల పైమాటే. అయితే వివాహం అనంతరం జెన్ని ఆస్తి కొంత తగ్గినట్లు తెలుస్తున్నది. గతంలో మార్క్ అంథోనీని వివాహం చేసుకున్న జెన్నీ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

    మొత్తంగా జెన్నీ కోరికకు బెన్ ఒప్పుకుంటే, 900 కోట్లకు పైగా భరణం దక్కుతుంది. అయితే కుర్రకారు కలలరాణి అయిన జెన్నిఫర్ లోపేజ్ విడాకుల అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

    బెన్ అప్లెక్స్, జెన్నిఫర్ లోపెజ్ కలిసి రెండు సినిమాల్లో నటించారు. 2003లో వీరిద్ధరూ కలిసి రోమాంటిక్ చిత్రం గిగ్లి లో కనువిందు చేశారు. 2004లో కెవిన్ స్మిత్ కామెడీ సినిమా జెర్సీలో జంటగా కనిపించారు. 2002 నుంచి 2004 వరకు ఇద్దరూ డేటింగ్ చేశారు. కాగా, జెన్నీ,బెన్ రెండు సార్లు పెండ్లి చేసుకున్నారు.

    మొదటగా 2022లో లాస్ వెగాస్ లో మొదటి వివాహం , 2022లో ఆగస్టు లో జార్జియా లో వివాహం చేసుకున్నారు. బెన్ వ్యవహార శైలి వల్లే జెన్నిఫర్ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా. బెన్ మాత్రం తన తీరు మార్చుకోలేదని సమాచారం. ఇక తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలని మాత్రం ఇద్దరూ ఆలోచిస్తున్నారట.