Tollywood: టాలీవుడ్ సినిమాలకే పట్టమా? ఓవర్సీస్ లెక్క మారిందా?

రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచి వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్ల సినిమాలు కాకుండా ఇతర సినిమాలకు 5 మిలియన్లు కూడా రాలేదు. కానీ హనుమాన్ సినిమా మాత్రం రేర్ ఫీట్ చేసి చూపించింది.

Written By: Swathi, Updated On : January 31, 2024 5:39 pm

Tollywood

Follow us on

Tollywood: చిన్న సినిమాలు రికార్డులు సృష్టించడం గ్రేట్ అనే చెప్పాలి. కానీ ఈ మధ్య చిన్న సినిమాలే మంచి హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. కాంతార, డీజే టిల్లు సినిమాలు ఏ రేంజ్ లో హిట్ లను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. ఈ సినిమాలకు సీక్వెన్స్ లు కూడా రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా సంచలనాలు చూసాక ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోయింది.

రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచి వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్ల సినిమాలు కాకుండా ఇతర సినిమాలకు 5 మిలియన్లు కూడా రాలేదు. కానీ హనుమాన్ సినిమా మాత్రం రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు దేవర హక్కులు 27 కోట్లకు కొననున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే 5 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మొన్నటికి మొన్న గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి.

అలాగే రామ్ చరణ్, శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట వాస్తవమే. మార్కెట్ పెరిగిందని భారీ రేట్ పెట్టి కొంటే.. బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది. ఓవర్సీస్ లో లాభాలు రావడం అంటే చిన్న విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల టార్గెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లెక్కలేసుకొని రైట్స్ తీసుకోవడం మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో..

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రైట్స్ కూడా 17 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతుంది. ఇవి బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే.. వారి వారి కెరీర్ లో పాత రికార్డులన్నీంటిని తుడిచివేయాల్సి ఉంటుంది.