Dame Maggie Smith: హ్యారీ పోటర్, డౌన్టన్ అబ్బే చిత్రాలతో కీర్తి దక్కించుకున్న ‘డేమ్ మ్యాగీ స్మిత్’ 89 సంవత్సరాల వయస్సులో మరణించారు. ‘డేమ్ మ్యాగీ స్మిత్ మరణాన్ని బాధాకరంగా ప్రకటించాం. ఆమె సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున హాస్పిటల్ లో ప్రశాంతంగా మరణించింది.’ అని ఆమె కుమారులు క్రిస్ లార్కిన్, టోబి స్టీఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణంతో చిత్ర సీమకు చెందిన వారితో పాటు దేశానికి చెందిన కింగ్ చార్లెస్, ప్రధానమంత్రి నివాళులర్పించారు. కింగ్ చార్లెస్ ఆమెను ‘ఒక జాతీయ నిధి’గా అభివర్ణించగా, సర్ కీర్ స్టార్మర్ ఆమె ‘ఆమె గొప్ప ప్రతిభకు చాలా మంది అభిమానించారు.’ హ్యారీ పోటర్ స్టార్ డేనియల్ రాడ్ క్లిఫ్ తనతో ఆమె కలిసి నటించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. హ్యారీ పోటర్ చిత్రాల్లో ఆమె హోగ్ వార్ట్స్ లోని యువ మాంత్రికులతో కలిసి కినిపించింది. ప్రొఫెసర్ మినర్వా మెక్ గోనాగల్ పాత్ర పోషించింది. నివాళి అర్పించని రాడ్ క్లిఫ్ ఆమెతో కలిసి నటించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ‘ఆమె ప్రతిభ కలిగిన నటి. ఒకే క్షణంలో భయపెట్టగలదు, ఆకర్షించగలదు. ఆమెతో కలిసి సెట్ లో గడపడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
ఆమె డిసెంబర్ 28, 1934న ఇంగ్లండ్‌లోని ఇల్‌ఫోర్డ్‌లో జన్మించింది. ఆరు దశాబ్దాలకు పైగా ఆమె నటనలోనే గడిపింది. ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీ (1969), తన మొదటి అకాడమీ అవార్డును గెలుచుకోవడం, ఎ రూమ్ విత్ ఎ వ్యూ (1985) వంటి చిత్రాల్లోలో ఆమె తన పాత్రలతో ప్రాముఖ్యత పొందింది. స్మిత్ హ్యారీ పాటర్ సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్‌గోనాగల్, డోవ్న్టన్ అబ్బేలోని డోవెగర్ కౌంటెస్ పాత్ర పోషించింది.
ఆమె రెండు ఆస్కార్లు, ఐదు బేఫ్టాలతో సహా ప్రశంసలను దక్కించుకుంది. ఆమె కెరీర్ చలనచిత్రం, టెలివిజన్ మరియు రంగస్థలం అంతటా విస్తరించి ఉంది, థియేటర్‌లో చెప్పుకోదగిన పనితో. స్మిత్ బ్రిటిష్ నటనలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రియమైన వ్యక్తులలో ఒకరు. 1990లో స్మిత్‌కు క్వీన్ ఎలిజబెత్ నైట్ బిరుదు ఇచ్చి డామ్‌గా మారింది. ఆమె మరణం చిత్ర సీమకు తీరని లోటని తోటి నటులు అన్నారు. లెజెండ్ అనే పదం ఆమెకు చక్కగా సరిపోతుందని అన్నారు.
డేమ్ మ్యాగీ స్మిత్ 1970లో ది ప్రైమ్ ఆఫ్ మిస్ జీన్ బ్రాడీ, 1979లో కాలిఫోర్నియా సూట్ చిత్రాలకు రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఆమెకు మరో నాలుగు నామినేషన్లు ఉన్నాయి, ఏడు బాఫ్టా అవార్డులు లభించాయి. ఆమె నటనను, గొప్ప మనసును స్మరించుకుంటున్నామని కింగ్ చార్లెస్, అతని రాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డేమ్ మ్యాగీ నిజమైన జాతీయ సంపద అని, ఆమె కృషి రాబోయే తరాలకు చిరస్మరణీయమని ప్రధాని అన్నారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Harry potter professor dame maggie smith 89 has passed away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com