https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 8’ నుండి హరితేజ అవుట్..ఉన్నది 6 వారాలే.. కానీ రెమ్యూనరేషన్ నిఖిల్ కంటే ఎక్కువ!

నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు కానీ, మనకి టెలికాస్ట్ అయ్యేది మాత్రం ఈరోజే. ఇదంతా పక్కన పెడితే అసలు హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటో చూద్దాం. ఈమెకు టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు బాగానే ఆడింది కానీ, కుళ్ళు, అసూయ వంటి లక్షణాలను జనాలు నచ్చలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 08:09 AM IST

    Bigg Boss Telugu 8(211)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా వచ్చిన హరితేజ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ సీజన్ లో టాస్కులు ఆడడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ, ప్రవర్తనలో కానీ తోపు అనిపించింది. అందుకే అంతకు ముందు హరితేజ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకపోయినా, బిగ్ బాస్ షోలో టాప్ 3 వరకు వచ్చి అశేష ప్రేక్షకాభిమానంని పొందింది. ఆ ఫేమ్ తోనే ఈమె సినిమాల్లో అవకాశాలను కూడా సంపాదించింది. సినిమాల్లో ఎదో ఒకటి రెండు అవకాశాలు కాదు, టాప్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగా అని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ ‘దేవర’ లో కూడా ఈమె నటించింది. అలాంటి కంటెస్టెంట్ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టబోతుంది అని తెలియగానే ఆడియన్స్ ఆమెపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సీజన్ లో కూడా ఆమె టాప్ 5 వరకు వస్తుంది అని అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఆమె ఎలిమినేట్ అవ్వబోతుంది.

    నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు కానీ, మనకి టెలికాస్ట్ అయ్యేది మాత్రం ఈరోజే. ఇదంతా పక్కన పెడితే అసలు హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటో చూద్దాం. ఈమెకు టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు బాగానే ఆడింది కానీ, కుళ్ళు, అసూయ వంటి లక్షణాలను జనాలు నచ్చలేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఈమె పక్క కంటెస్టెంట్స్ గురించి ఎవరో ఒకరి దగ్గర చెడుగా మాట్లాడడం ఈమెకు బాగా నెగటివ్ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సీజన్ 1 హరితేజ కి, సీజన్ 8 హరితేజ కి నక్కకి నాగలోకం కి ఉన్నంత తేడా ఉంది. అందుకే ఆడియన్స్ కి ఈసారి ఆమె అసలు కనెక్ట్ అవ్వలేదు. ఈమె ఎలిమినేషన్ కోసం ఎదురు చూసారు. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యినందుకు ఆనందంగా పోస్టులు పెడుతున్నారు.

    ఇది ఇలా ఉండగా హరితేజ పాపులర్ నటి కాబట్టి ఆమెకి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా ఆ పాపులారిటీ కి తగ్గట్టుగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈమెకు వారానికి నాలుగు లక్షల రూపాయిలు ఇచ్చారట. అంటే ఆమె ఆరు వారాలు హౌస్ లో కొనసాగింది కాబట్టి, ఆరు వారాలకు గాను 24 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ సీజన్ లో ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న నిఖిల్ కి 12 వారాలతో సమానమైన రెమ్యూనరేషన్ అది. అంటే ఆయనకీ వారానికి కేవలం 2 లక్షలు మాత్రమే. హరి తేజ కి మాత్రం నిఖిల్ కి డబుల్ రెమ్యూనరేషన్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రెమ్యూనరేషన్ పరంగా హరితేజ కి బాగా ఈ సీజన్ ఉపయోగపడి ఉండొచ్చేమో కానీ, ఆడియన్స్ లో మాత్రం ఈమె మీద ఉన్న మంచి అభిప్రాయం చెడిపోయింది. ఈ సీజన్ లో ఆమె రాకుండా ఉంది ఉంటేనే బాగుండేది.