https://oktelugu.com/

Kotha Paluku RK: వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సీసీ కెమెరాలు పెట్టే మీడియా.. నీతులు చెప్పడమా?

నిజమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధలో అర్థం ఉంది. సోషల్ మీడియాలో సైకోలు పెరిగిపోయారని చెప్పడంలో నిజముంది. ఆయన ఆవేదనలో ఆర్ద్రత ఉంది.. ఆయన నీతులు చెప్పుడే కాస్త కంటగింపుగా ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 10, 2024 / 08:34 AM IST

    ABN RK

    Follow us on

    Kotha Paluku RK: ఏపీలోనే కాదు సోషల్ సైకోలు ప్రపంచం మొత్తం ఉన్నారు. సోషల్ మీడియా అంటేనే ఓ దిక్కూ దివానం లేని వ్యవస్థ. ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేసుకోవచ్చు.. నచ్చినంత బురద కుమ్మరించవచ్చు. వ్యక్తిగత దూషణకు పాల్పడొచ్చు. అవసరమైతే బజారుకు ఈడ్చవచ్చు.. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా.. అలాంటప్పుడు సోషల్ మీడియాలో సైకోలు కాకుండా ఇంకెవరు ఉంటారు. పైగా ఏపీ లాంటి రాష్ట్రంలో అలాంటి వారికి రెడ్ కార్పెట్ పరిచారు. ఇప్పటికి పరుస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మాత్రమే మారాయి.. ఆ సైకోలు సృష్టిస్తున్న వీరంగం మాత్రం అలానే ఉంది. ఇంట్లో ఆడవాళ్లను బజారులోకి లాగే చేస్తున్న వ్యక్తిత్వ హననం గురించి చెబితే ప్రతిరోజు ద్రౌపదికి జరిగిన దారుణాలే.. ఇందులో టిడిపి శుద్ధ పూస కాదు. రాధాకృష్ణ చెబుతున్నట్టు వైసిపి మాత్రమే దోషికాదు. తిలా పాపం తలా పిరికెడు. బాధిత పక్షంగా ఉన్న వారికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో..

    నాడు రాధాకృష్ణ ఏం రాసినట్టు

    అప్పట్లో బెంగళూరులో ఓ నటి పోలీసుల ఆపరేషన్ లో దొరికిపోయారు. ఆమె వ్యభిచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా పత్రికా ప్రమాణాల ప్రకారం ఇలాంటి విషయాలలో పేర్లు రాయకూడదు. కనీసం ఫోటోలు కూడా ప్రచురించకూడదు. ఆ మాత్రం సోయి లేని రాధాకృష్ణ పత్రిక ఆ నటి ఫోటో వేసింది. ఏకంగా ఆమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందని రాసేసింది. పైగా ఓ పార్టీ నాయకుడికి లింకు కట్టి ఒక కథనాన్ని అచ్చువేసింది. ఇలాంటి విధానం ఎలాంటి విలువలకు సోపానమో రాధాకృష్ణ చెప్పాలి. అప్పట్లో ఓ ప్రధాన పార్టీ నాయకురాలికి.. ఓ సినీ హీరోకు ముడిపెట్టి కొంతమంది అడ్డగోలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఆ విషయాన్ని కూడా రాధాకృష్ణ పత్రిక నిర్లజ్జగా ప్రచురించింది. నేడు అదే పత్రిక ఆ నాయకురాలికి భజన చేస్తోంది. ఆమె విషయంలో విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. మరి ఈరోజు నీతులు చెబుతున్న రాధాకృష్ణ.. ఆరోజు ఏం చేసినట్టు.. అయితే ఇక్కడ ఒకరిని విమర్శించడం మా అభిప్రాయం కాదు.. కాకపోతే మీడియా ఆధిపతులుగా.. వార్తాపత్రికల యజమానులుగా ఉండే వ్యక్తులు న్యూట్రల్ స
    స్వభావాన్ని కొనసాగించాలి కదా.. అలాకాకుండా ఒకరిని మాత్రమే విమర్శించడం దేనికి.. ఈ ప్రకారం చూసుకుంటే రాధాకృష్ణ జగన్ కుటుంబం మీద కుమ్మరిస్తున్న బురద ఎంతని.. చివరికి వివేకానంద హత్య కేసులో “అర్ధరాత్రి మూడు గంటలకు ఒక వ్యక్తి నుంచి మరో మహిళకు ఫోన్ వెళ్ళింది” అనే విషయాన్ని ప్రస్తావించడం ఎలాంటిదని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. వైసిపి లో సోషల్ సైకోలు ఉన్నాడు సరే.. మరి రాధాకృష్ణ తనలో ఉన్న ఆ తరహా వ్యవహార శైలిని ఎందుకు బయట పెట్టుకోడు.. ఎందుకు తగ్గించుకోడు.. అంటే మందికి చెప్పడానికే నీతులు ఉంటాయా.. తన పేపర్లో రాసుకోవడానికి రాతలు ఉంటాయా?!