https://oktelugu.com/

Bigg Boss Telugu 8: కన్నింగ్ గేమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ప్రేరణ.. నాగార్జున కి కూడా మైండ్ బ్లాక్ చేసిందిగా!

మెగా చీఫ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలలో ఒకరైన రోహిణి కి నిన్న ఆమె పొడిచిన వెన్నుపోటు ఏదైతే ఉందో , దానిని వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇంత సేఫ్ గేమా..?, అసలు ఈ మనిషికి ఓట్లు ఎవరు వేస్తున్నారు రా బాబు అని అనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 08:01 AM IST

    Bigg Boss Telugu 8(210)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ, యష్మీ ఎక్కువగా అరుస్తూ హైలైట్ అవ్వడం వల్ల ప్రేరణ కన్నింగ్ గేమ్ జనాలకు చాలా వరకు తెలియలేదు. ఇప్పుడిప్పుడే ఈమె అసలు రంగు బయటపడుతూ ఉంది. ఒక మనిషి మీద కుళ్ళు, కన్నింగ్ నేచర్, వెన్నుపోటు పొడిచే తత్త్వం, నోటి దూల, స్వార్థం, బలుపు ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ఆమెనే ప్రేరణ అని ఈమధ్య అర్థం అవుతుంది. ఈ లక్షణాలన్నీ ఆమెకి ఫ్యాన్ బేస్ ఏర్పడిన తర్వాత బయటపడింది, ఇవన్నీ ముందు వారాల్లోనే చూపించి ఉండుంటే అసలు ఇన్ని వారాలు ఆమె హౌస్ లో కొనసాగేది కాదు. ఇప్పుడు హౌస్ కి మెగా చీఫ్ అయ్యాక ఈమె తన నెగటివ్ యాంగిల్స్ ని ఇంకా బయటకి తీస్తుంది. మైక్రో మ్యానేజ్మెంట్ కి అర్థం చూపెడుతూ హౌస్ లో కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా చిరాకు రప్పిస్తుంది. ఈమె మెగా చీఫ్ అవ్వడానికి కారణాలలో ఒకరు గౌతమ్. అతనికి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ లో వెన్నుపోటు పొడిచింది.

    అదే విధంగా ఈమె మెగా చీఫ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలలో ఒకరైన రోహిణి కి నిన్న ఆమె పొడిచిన వెన్నుపోటు ఏదైతే ఉందో , దానిని వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇంత సేఫ్ గేమా..?, అసలు ఈ మనిషికి ఓట్లు ఎవరు వేస్తున్నారు రా బాబు అని అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తేజ వల్ల ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ రద్దు అవుతుంది. ఆ ప్రక్రియ లో చివరగా మిగిలిపోయింది నభీల్, రోహిణి, నిఖిల్. వీరిలో ఎవరో ఒకరికి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ దక్కేందుకు నాగార్జున హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇస్తాడు. ఈ ముగ్గురిలో ఎవరికీ ఈ పాస్ దక్కాలి అనుకుంటున్నారో, వాళ్ళని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లండి అంటాడు నాగార్జున. ముందుగా ప్రేరణ లేచి రోహిణి ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆమె రోహిణి గురించి మాట్లాడుతూ ‘తనకి హౌస్ లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తల్చుకుంటే ఆమె వాళ్లకు కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఇవ్వొచ్చు. కానీ బయట నా గేమ్ చూసొచ్చి, నాకు న్యాయం చేయాలని ఇచ్చింది. దీనిని బట్టీ చూస్తే ఆమె అందరి గురించి ఆలోచిస్తుంది. ఏవిక్షన్ పాస్ ఆమె చేతిలో ఉంటే తనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అలోచించి ఉపయోగిస్తుంది’ అని చెప్తుంది.

    ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ చివర్లో ‘టై’ అయ్యి, మెగా చీఫ్ అయ్యినందుకు ప్రేరణ ని ఎవరినో ఒకరిని ముందుకు తీసుకెళ్ళు అని నాగార్జున అనగా, ఆమె రోహిణి ని కాకుండా నభీల్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంతలోనే ఆలోచన మార్చుకున్నావ్ ఏమిటి అని నాగార్జున అడగగా, రోహిణి నాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఆ విశ్వాసంతో నేను ఆమెను ముందుకు తీసుకెళ్ళాను, కానీ నాకు రెండవ ఛాయస్ వస్తే నభీల్ ని ముందుకు తీసుకెళ్దాం అని అనుకున్నాను అంటూ చాలా సేఫ్ గా సమాధానం చెప్తుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే వెన్నుపోటు పొడవడం ఎక్కడైనా జరుగుతుందా?..రోహిణి వైల్డ్ కార్డు కంటెస్టెంట్, ఆమె ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాలేదు, ఒకవేళ వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అనేది హౌస్ లో నడిచే టాక్,ఈ పాస్ ఆమెకి ఉపయోగపడుతుంది కానీ, టాప్ ప్లేయర్ నభీల్ కి అవసరం ఏమిటి?..చేస్తే పూర్తిగా సపోర్టు చేయాలి, లేకపోతే మానుకోవాలి. ఇక్కడ ప్రేరణ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, రోహిణి కి పాస్ ఇస్తే కేవలం ఆమె వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కోసమే ఉపయోగిస్తుంది. అదే నభీల్ కి ఇస్తే తన కన్నడ బ్యాచ్ లో ఎవరైనా నామినేషన్స్ లోకి వచ్చి డేంజర్ జోన్ లోకి వస్తే, నాభీ ని బ్రతిమిలాడి సేఫ్ చేయొచ్చు. ఇంత కన్నింగ్ ఆలోచన ప్రేరణ లో ఉందని తెలియక పాపం రోహిణి అన్యాయం అయిపొయింది. ఇప్పటికైనా ఆడియన్స్ ప్రేరణ నిజస్వరూపం తెలుసుకున్నారో లేదో చూడాలి.