Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ తో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హరీష్ శంకర్…ఆయనే ఇచ్చాడా.? వాళ్లే తీసుకున్నారా..?

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమా ప్లాప్ అయింది అంటే ప్రొడ్యూసర్ తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఇలాంటి రోజుల్లో కూడా కొంత మంది దర్శక, హీరోలు ఆ అష్టన్ని భర్తీ చేయడానికి వాళ్ల రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తు ఉంటారు...

Written By: Gopi, Updated On : September 5, 2024 12:35 pm

Harish Shankar

Follow us on

Harish Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లు చాలామంది తమదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే క్రమంలోనే చాలామంది దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమాకు కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. దాంతో భారీ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ కి తన రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే దానికి పూర్తి బాధ్యత దర్శకుడే వహించాల్సి ఉంటుంది.

కాబట్టి సినిమా ఫ్లాప్ అయినప్పుడు రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసి ప్రొడ్యూసర్ కి వచ్చిన నష్టాన్ని తగ్గించడంలో మన దర్శకుడు హీరోలు ఎప్పుడు ముందుంటారు. అందుకోసమే హరీష్ శంకర్ కూడా ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ ఇంతకుముందు చాలా మంది దర్శకులు కూడా ఇలానే తమ రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. దీని వల్ల ప్రొడ్యూసర్ మరికొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నిజానికి చిన్న సినిమాలు ఫ్లాప్ అయిన పెద్దగా నష్టమైతే రాదు. కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు నష్టపోతే మాత్రం వాళ్లకు భారీ రేంజ్ లో నష్టాలు రావడమే కాకుండా ఈ నష్టం తాలూకు ఎఫెక్ట్ అనేది తర్వాత సినిమాల మీద కూడా పడుతుంది…

అందుకే ఒక సినిమా చేయాలంటే ముందుగా దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా చేస్తే సినిమాలు ఈజీగా సక్సెస్ అవుతాయి. అలా కాకుండా ఆడుతూ పాడుతూ సినిమా చేయాలని చూస్తే ఇలాగే డిజాస్టర్లు వస్తాయంటూ మరి కొంత మంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…