https://oktelugu.com/

Kantara 2: కాంతార 2 కోసం టాలీవుడ్ స్టార్ హీరోను లైన్ లో పెడుతున్న రిషబ్ శెట్టి…

సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం క్యామియో రోల్స్ కి గానీ, స్పెషల్ పాత్రలకు గానీ ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది... అందుకే చాలా మంది హీరోలు కూడా వాళ్ల సినిమాల్లో స్పెషల్ పాత్రలను క్రియేట్ చేయించుకొని స్టార్ హీరోలతో ఆ పాత్రల్లో నటింపజేస్తున్నారు..

Written By:
  • Gopi
  • , Updated On : September 5, 2024 / 12:30 PM IST
    Kantara 2

    Kantara 2

    Follow us on

    Kantara 2: కన్నడ సినిమా ఇండస్ట్రీలో కాంతార సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం ఆయన కాంతార 2 సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే ఆయన తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోని కూడా ఒక భాగం చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకపాత్ర లో నటించబోతున్నాడు అనే వార్తలైతే కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఎన్టీయార్ రిషబ్ శెట్టి తో కలిసి బెంగళూరులోని పలు దేవాలయాలను సందర్శించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం కూడా చాలా సందర్భాల్లో తెలియజేశారు.

    ఇక దానికి తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ కాంతార 2 సినిమాలో తనని నటించమంటే నటిస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనక అందుకున్నట్లయితే రిషబ్ శెట్టి మరోసారి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు.

    కాంతార అనే సినిమా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. మరి కాంతార 2 తో రిషబ్ శెట్టి ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కేజిఎఫ్ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలకి రూట్ వేశాడు. దాంతో కాంతార సినిమాని కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక మొత్తానికైతే కాంతార 2 సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది.

    అందుకు తగ్గట్టుగానే రిషబ్ శెట్టి కూడా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ని భాగం చేస్తే సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే కాంతర 2 సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది…