Harish Shankar: ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బాటలోనే నడుస్తున్న హరీష్ శంకర్…

Harish Shankar: 'దబాంగ్ ' సినిమాను 'గబ్బర్ సింగ్ ' పేరుతో రీమేక్ చేసి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత తమిళం లో సూపర్ హిట్ అయిన 'జిగర్తాడ' సినిమాను 'గద్దలకొండ గణేష్ ' పేరు తో మరొక రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

Written By: Gopi, Updated On : June 19, 2024 11:06 am

Harish Shankar walking in the path of former star director

Follow us on

Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఒక జానర్ లో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. కొంతమంది డైరెక్టర్లు రిమేక్ సినిమాలని చాలా అద్భుతంగా తెరకేక్కిస్తుంటే మరి కొంత మంది మాత్రం స్ట్రైయిట్ స్టోరీలతో ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా సినిమాలను తీస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన రీతిలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు..

ఆయన చేసిన సినిమాల్లో ఆయన అందుకున్న సక్సెస్ ల్లో ఎక్కువ శాతం రీమేక్లే ఉండడం విశేషం… ముఖ్యంగా బాలీవుడ్ లో హిట్ అయిన ‘దబాంగ్ ‘ సినిమాను ‘గబ్బర్ సింగ్ ‘ పేరుతో రీమేక్ చేసి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత తమిళం లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాడ’ సినిమాను ‘గద్దలకొండ గణేష్ ‘ పేరు తో మరొక రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

Also Read: Pawan Kalyan: వెంకటేష్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

ఇక ఇప్పుడు రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇది కూడా రైడ్ అనే బాలీవుడ్ సినిమాకి రీమేక్ కావడం విశేషం.. ఇంకా దీంతోపాటుగా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తేరీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది అంటూ చాలామంది కామెంట్లైతే చేస్తున్నారు. అయితే సినిమా రీమేక్ అనేది సినిమా యూనిట్ ఎక్కడ కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా కూడా రీమేకే అంటు మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.

Also Read: Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి మరో సినిమా చేయబోతున్నారా..?

ఇక అప్పట్లో భీమినేని శ్రీనివాసరావు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆయన తర్వాత ఎక్కువ రీమేక్ లు చేసి మంచి సక్సెస్ లను అందుకుంటున్న దర్శకులు మరొకరు లేరనే చెప్పాలి. ఇంకా ఇప్పుడు హరీష్ శంకర్ ఆయన బాటలో నడుస్తున్నాడా అంటూ మరి కొంతమంది ఆయన పైన కామెంట్లైతే చేస్తున్నారు…