https://oktelugu.com/

Harish Shankar : పూరి జగన్నాధ్ ని ఉద్దేశించి సంచలన కామెంట్లు చేసిన హరీష్ శంకర్ ..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే సినిమాలా మధ్య  పోటీ ఉంటుంది. ఒకే రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దానివల్ల ఆయా హీరోల ఫ్యాన్స్ కు కూడా చాలా మంచి కిక్కు వస్తుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 10:02 PM IST
    Follow us on

    Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీసే దర్శకులు చాలామంది ఉన్నప్పటికీ అందులో పూరీ జగన్నాథ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఈయన ఒకప్పుడు చాలా తక్కువ రోజుల్లో స్టార్ హీరోలతో సైతం సినిమాలను చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టేవాడు. ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన తన సత్తా చాటడానికి మరోసారి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన తన ఫామ్ ను కోల్పోవడం స్టార్ హీరోలు తనకు డేట్స్ ఇవ్వకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ తో ఆయన చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గత నాలుగు సంవత్సరాల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్ ‘  అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ కూడా రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్ ‘  సినిమాని కూడా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు…
    అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హరీష్ శంకర్ కొంతమంది దర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసినప్పటికీ చిరుత, బుజ్జిగాడు, నేనింతే లాంటి సినిమాలకు హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. ఇక ఇప్పుడు ఇదంతా చూసిన చాలామంది హరీష్ శంకర్ తన గురువు అయిన పూరి జగన్నాథ్ సినిమాకి పోటీగా తన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాని తీసుకొస్తున్నాడా? అనే కామెంట్లను కూడా చేస్తున్నారు. ఇక  ఇలాంటి క్రమంలోనే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా యూనిట్ రీసెంట్ గా క్యూ అండ్ ఏ శేషన్ ను ఏర్పాటు చేశారు.
    ఇక అందులో ఒక రిపోర్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశించి మీ గురువు అయిన పూరి జగన్నాథ్ గారి సినిమాకి పోటీగా మీ సినిమాను తీసుకొస్తున్నారా అని అడిగాడు. దానికి హరీష్ శంకర్ తనదైన రీతిలో సమాధానం అయితే చెప్పాడు. ఇక అందులో భాగంగానే మరొక రిపోర్టర్ పూరి గారు మీకు ఫోన్ చేసి మీ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకోమని చెప్తే మీరు ఏం చేస్తారని అడిగాడు. దానికి హరీష్ శంకర్ ఘాటు గానే రియాక్ట్ అవుతూ పూరి జగన్నాథ్ గారు నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్తారండి.
    దాని గురించి మనం అనుకోవడం దేనికి అయిన పూరి జగన్నాథ్ అంటే నా దృష్టిలో చాలా టాప్ లో ఉన్న డైరెక్టర్..ఆయనతో నన్ను పోల్చి ఎందుకు ఆయనను తక్కువ చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చను లేవనెత్తింది. ఇక హరీష్ శంకర్ వెటకారం తో రిపోర్టర్ల కు  సమాధానం చెప్తున్నాడు అంటూ హరీష్ శంకర్ మీద ఒక వర్గం వారు కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. మరి దీనివల్ల హరీష్ శంకర్ సినిమాకి ఏమైన ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…