https://oktelugu.com/

Delhi floods : చుట్టూ వరద నీరు.. దీనికంటే నరకమే బాగుంటుందేమో.. పెను సంచలనంగా మారిన సీజేఐకి సివిల్స్ విద్యార్థి రాసిన లేఖ విషయాలు

విద్యార్థులు ఆందోళన చేయడంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2024 / 09:53 PM IST

    Delhi floods

    Follow us on

    Delhi floods : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్ ను వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది క్రమేపీ రాజకీయ రంగు పులుముకోవడంతో దేశ రాజధాని లో ఉన్న సివిల్స్ కోచింగ్ సెంటర్ల దుస్థితి తెరపైకి వస్తోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ కు ఓ సివిల్స్ విద్యార్థి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. వాస్తవానికి వరదల కారణంగా రావూస్ ఐఏఎస్ అకాడమీలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన ఢిల్లీ నగర అధికారులు, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందని పలువురు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళన దేశ రాజధాని ఢిల్లీని అట్టుడికిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వరదల వల్ల మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విద్యార్థి పేరు అవినాష్ దుబే.. అతడు ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ లోని ఐఏఎస్ స్టడీ సెంటర్ లో దారుణాలను ఆ లేఖలో పేర్కొన్నాడు. ” సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నమస్కారాలు. సార్ ఈ రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ చదువుకోవడం మాకు ఉన్న ప్రాథమిక హక్కు. ఇక్కడ నీటి ఎద్దడి ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో అస్సలు తెలియదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మేము సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాం. మా భద్రతకు ముప్పు వాటిల్లుతున్నప్పటికీ సివిల్స్ కలను సాకారం చేసుకునేందుకు కష్టపడుతున్నాం. అయితే మాలాంటి వాళ్లకు చదువుకునేందుకు సురక్షితమైన వాతావరణం చాలా అవసరం. అప్పుడే మేము స్వేచ్ఛగా చదువుకుంటాం. పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి దేశ అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తామని” ఆకాశ్ లేఖలో పేర్కొన్నాడు.

    ఇదే సమయంలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న ఇతర ప్రాంతాల్లో పరిస్థితులను కూడా ఆకాష్ సిజెఐ కి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఢిల్లీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందువల్ల వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆకాష్ వివరించాడు.. నిబంధనలకు విరుద్ధంగా లైబ్రరీగా మార్చారని.. అందువల్లే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారని ఆకాష్ ఆరోపించాడు. ” చుట్టూ వరద నీరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేము ఉన్న పరిస్థితి నరకానికి అంటే దారుణంగా ఉంది. ఇలాంటి దుస్థితి మధ్య చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మేము నరకంలో జీవిస్తున్నామని” ఆకాష్ ఆ లేఖలో వివరించాడు. రావూస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆ ప్రమాదం జరిగిందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అతడు ఆ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల మృతి తనను ఎంతగానో కలచి వేసిందని బాధపడ్డాడు. ఇక రాహుల్ స్టడీ సర్కిల్లో బెస్ మెంట్ లోకి అనూహ్యంగా వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. విద్యార్థులు ఆందోళన చేయడంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.