Harish Shankar : సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమాను తీసిన దర్శకులు వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అయితే కొత్తగా క్యూ అండ్ ఏ శేషన్ అనేది నిర్వహిస్తూ సినిమా మీద మంచి హైప్ ను క్రియేట్ చేయడానికి కొంతమంది రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు ఆయా సినిమా యూనిట్ లోని కొంత మంది సభ్యులు సమాధానం చెబుతూ ఉంటారు. అయితే దీనివల్ల కొంతవరకు సినిమాకు మంచి ప్రమోషన్ అయితే జరుగుతుంది. కానీ ఆయా రిపోర్టర్లు అడిగే ప్రశ్నల వల్ల ఆ సినిమాలో నటించిన నటినటులు గాని, దర్శక నిర్మాతలు గాని చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక చేతికి మైకు దొరికింది కదా అని కొంతమంది రిపోర్టర్లు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ని అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక దీని ద్వారా కొంతమంది రిపోర్టర్లని క్యూ అండ్ ఏ సెషన్ కు రాకుండా చూసుకుంటున్నారు. ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు సైతం రిపోర్టర్లు ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడతారో అనే ఉద్దేశ్యంతోనే ఈ ఈవెంట్ కి చాలా మంది డుమ్మా కొడుతున్నారు. ఇక దీనిపట్ల విసిగిపోయిన డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఆయనకు క్యూ అండ్ ఏ శేషన్ కి వచ్చిన ప్రతిసారి వ్యంగ్యంగా సమాధానాలను చెబుతూ వాళ్లు అడిగే క్వశ్చన్స్ కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇక దీనిపట్ల కొంతమంది రిపోర్టర్లు అసహనాన్ని వ్యక్తం చేసిన కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా అందరికీ సరైన సమాధానం చెబుతూ వస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ వైఖరి పట్ల సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది చాలావరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రిపోర్టర్లకు సినిమా యూనిట్ కి మధ్య మంచి సత్ సంబంధాలు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే రిపోర్టర్లు అడిగే కొన్ని సిల్లీ క్వశ్చన్స్ వల్ల సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారుతుంది.
సినిమాకి సంబంధించినవి కాకుండా వాళ్ళ ప్రైవసీ లైఫ్ ను కూడా డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళ క్వశ్చన్స్ ఉండటం చూస్తున్న చాలామంది దీని మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రిపార్టర్లు ఎలాంటి క్వశ్చన్స్ అదుగుతున్నారు అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని ఆ ఈవెంట్ మేనేజర్ తో ఒకసారి క్లారిటీగా తెచ్చుకొని ఆ ఈవెంట్ కి హాజరైతే బెటర్ అని సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ప్రతి పెద్ద సినిమా క్యూ అండ్ ఏ సెషన్ లో ఏదో ఒక కాంట్రవర్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ను రిపోర్టర్లు అడగడం తద్వారా సెలబ్రిటీ లు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక వీడియో బైట్ ద్వారా తను అలా మాట్లాడాల్సింది కాదు అని ఆయా సినిమా హీరోలు గాని, ప్రొడ్యూసర్స్ గాని క్లారిటీ ఇచ్చుకోవడం లాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి…
దీనివల్ల వాళ్ల పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా సినిమాకి కూడా కొంతవరకు నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యూ అండ్ ఏ శేషన్ ను కొంచెం జాగ్రత్తగా నిర్వహిస్తే మంచిదని హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కూడా ఈ ఈవెంట్ ను కండెక్ట్ చేసేవాళ్ళకు తెలియజేస్తున్నాడు…