https://oktelugu.com/

HariHara Veeramallu: ఫైనల్​గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్​ ఎప్పుడంటే?

HariHara Veeramallu: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ హరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్​. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్​ కోశియుమ్​ సినిమాకు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్​. అదే హరిహర వీరమల్లు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 08:35 AM IST
    Follow us on

    HariHara Veeramallu: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ హరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్​. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్​ కోశియుమ్​ సినిమాకు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

    HariHara Veeramallu

    అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్​. అదే హరిహర వీరమల్లు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసుకుంది.

    మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.  డిసెంబరులో చివరి వారం నుచి ఈ సినిమా షూటింగ్​ రీస్టార్ట్ కానుందని సమాచారం. అదిరిపోయే యాక్షన్​ సీన్స్​తోనే ఈ షెడ్యూల్​ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో నిధి అగర్వాల్​ హీరోన్​గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం

    మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లానాయక్​.. ప్రస్తుతం ప్రమోషన్స్​ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్​లు సినిమాపై భారీగా అంచనాలు రేకెత్తించాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్  నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం.

    Also Read: Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…