https://oktelugu.com/

Kamal Haasan: కమల్​హాసన్​ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం

Kamal Haasan: దక్షిణ భారత సినిమా ప్రముఖ హీరో సూపర్​స్టార్​ కమల్​హాసన్​ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిదే. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, కమల్​ హాసన్​కు కొవిడ్ సోకిందని తెలిసినప్పటినుంచి ఆయన అభిమానులకు ఆందోళన నెలకొంది. త్వరగా కమల్​ కోలుకోవాలని పగలు, రాత్రి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కుమార్తె శ్రుతి హాసన్​ ట్విట్టర్​ వేదికగా కమల్​ కోలుకుంటున్నట్లు తెలిపిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 08:49 AM IST
    Follow us on

    Kamal Haasan: దక్షిణ భారత సినిమా ప్రముఖ హీరో సూపర్​స్టార్​ కమల్​హాసన్​ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిదే. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, కమల్​ హాసన్​కు కొవిడ్ సోకిందని తెలిసినప్పటినుంచి ఆయన అభిమానులకు ఆందోళన నెలకొంది. త్వరగా కమల్​ కోలుకోవాలని పగలు, రాత్రి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కుమార్తె శ్రుతి హాసన్​ ట్విట్టర్​ వేదికగా కమల్​ కోలుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

    Shruthi Haasan

    మరోవైపు కమల్​ ఆరోగ్య పరిస్థితి గురించి రజనీకాంత్​తో సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా, శ్రుతిహాసన్​ ఆయన విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.శృతి హాసన్ తన తండ్రి పక్కన శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో ఉండటానికి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం కమల్ క్వారంటైన్​లో కొనసాగుతున్నప్పటికీ.. శ్రుతి ఆసుపత్రిలోనే ఉండి.. తన తండ్రిని దగ్గరుడి చూసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యూల్​ను త్వరగా పూర్తి చేసుకుని.. చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం. కమల్​ పూర్తిగా కోలుకునేంత వరకు శ్రుతి అక్కడే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం

    ప్రస్తుతం శ్రుతి హాసన్ వరుస సినిమాలో బిజీగా ఉంది. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతోన్న సలార్​లో హీరోయిన్​గా నటిస్తుండగా.. మరోవైపు అమెజాన్ ప్రైమ్​లో విడుదలయ్యే ఓ వెబ్​సిరీస్​లోనూ కనిపించనుంది. దీంతోపాటు, అనిల్​ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్నసినిమాలోనూ ఛాన్స్​ కొట్టేసింది ఈ అమ్మడు.  మరోవైపు కమల్ హాసన్ తన రాబోయే తమిళ యాక్షన్ చిత్రం ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా నటించారు.

    Also Read: KS Nageswararao: టాలీవుడ్​లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి