CDAC Jobs: సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ కొన్ని నెలల క్రితం పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 111 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలు 97, ప్రాజెక్ట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 14 ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
https://cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంసీఏ అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ అనాలసిస్, క్వాలిటీ అస్యూరెన్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డేటాబేస్, డెవోప్స్, స్పీచ్ టెక్నాలజీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది.
Also Read: BSNL Recruitment: ఈసీఈ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జాబ్స్!
2021 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://cdac.in/index.aspx?id=ca_advtpepm_03_2021 వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: Guntur DCCB Recruitment 2021: గుంటూరు డీసీసీబీలో ఉద్యోగ ఖాళీలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే?