Hari Hara Veeramallu Trailer Update: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ గురించి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా లోకి అడుగుపెట్టేది ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ గురించి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అనే ఆశతోనే. కానీ ప్రతీ రోజు రావడం, అప్డేట్ కోసం ఎదురు చూడడం, అది రాకపోవడం తో నిరాశగా వెనక్కి వెళ్లడం వంటివి డైలీ రొటీన్ అయిపోయింది పాపం. ఇలాంటి కష్టాలు పగోడికి కూడా రాకూడదని , ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) అయ్యాక మా అభిమాన హీరో నుండి ఒక్క సినిమా విడుదలైతే చూసుకోవాలని అభిమానులు ఎంతో ముచ్చట పడడం, కానీ అది అందని ద్రాక్షా లాగా ఉండిపోవడం వంటివి అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తుంది. ఈ నెల 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
అయితే ఇప్పుడు మేకర్స్ ఎట్టకేలకు ఒక రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జులై 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ నిర్ణయం అనేది నిర్మాతల చేతిలో ప్రస్తుతం లేదు. కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియో చేతుల్లోనే ఉంది. థియేటర్స్ లో విడుదలకు ముందు వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే వెళ్ళాలి. ఒకవేళ వాయిదా వేస్తే పది కోట్ల రూపాయిలు కట్ చేస్తాడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే మూడు సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఎలాంటి కోతలు విధించలేదు. కానీ వాళ్ళు చెప్పిన డేట్ లో సినిమాని విడుదల చేయాలి, నిర్మాత చెప్పిన డేట్ లో విడుదల చేసే అవకాశం లేదు.
Also Read: Dhanush And Pawan Kalyan: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను – ధనుష్
నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని జులై 10 న విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆమేరకు అమెజాన్ ప్రైమ్ తో గత వారం చర్చలు జరిపాడు. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. జులై 18, లేదా 24న విడుదల చేయమని అంటున్నారు. ఈరోజు మళ్ళీ అమెజాన్ ప్రైమ్ తో భేటీ అయ్యారు. చర్చలు ముగిసాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో అసలు ఏమాత్రం తగ్గడం లేదట. చెప్పిన ఆ రెండు తేదీలలో విడుదల చేస్తే చేయండి, లేకపోతే 50 శాతం కోతలు విధిస్తాం అంటూ చెప్పారట. దీంతో మేకర్స్ జులై 18 కి ఈ సినిమాని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ లోపు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసి, ఆ ట్రైలర్ ద్వారానే విడుదల తేదీని ప్రకటిస్తారట. చూడాలి మరి ఈ సినిమా కనీసం ఈసారైనా చెప్పిన తేదికి వస్తుందా లేదా అనేది.