Dhanush And Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి సినీ సెలబ్రిటీలలో కూడా వీరాభిమానులు ఉన్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, మహేష్ బాబు, ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి వారికి సినీ సెలబ్రిటీలలో అభిమానులు ఉన్నారు కానీ, పవన్ కళ్యాణ్ కి వాళ్ళకంటే కాస్త ఎక్కువ అనొచ్చు. ముఖ్యంగా తమిళనాడు లో స్టార్ హీరోలందరూ బహిరంగంగా ఆయన అభిమానులం అని అనేక సందర్భాల్లో చెప్పారు. వారిలో విలక్షణ నటుడు ‘ధనుష్'(Dhanush) కూడా ఉన్నాడు. ఎదో ఈమధ్య పుట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని కాదు ఇతను, ఎన్నో ఏళ్ళ నుండి పవన్ అభిమాని గా చలామణి అవుతున్నాడు. అప్పట్లో అభిమానులతో ట్విట్టర్ లో జరిగిన ఇంటరాక్షన్ లో కూడా నెటిజెన్స్ తెలుగు లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే ‘నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని, ఇతర హీరోల అభిమానులు దయచేసి నన్ను ద్వేషించకండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!
‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే మాట. ఇక నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానం ని మరోసారి చాటుకున్నాడు. యాంకర్ సుమ ధనుష్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య కాలం లో మీరు ఎక్కువగా దర్శకత్వం వైపు కూడా ఫోకస్ పెడుతున్నారు కదా. తెలుగు లో మీరు దర్శకత్వం వహించాల్సి వస్తే ఏ హీరో తో సినిమా చేస్తారు’ అని అడగ్గా, దానికి ధనుష్ క్షణం కూడా ఆలోచించకుండా ‘పవన్ కళ్యాణ్ సార్’ అని సమాధానం ఇస్తాడు. దీంతో ఆడిటోరియం మొత్తం ఈలలతో దద్దరిల్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ధనుష్ మాకంటే పెద్ద కల్ట్ ఫ్యాన్ లాగా అనిపిస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే ధనుష్ ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘ఇడ్లీ కడై’ అనే చిత్రం లో ధనుష్ హీరో గా నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అదే విధంగా గత ఏడాది ఆయన ‘రాయన్’ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. ఇది కమర్షియల్ గా ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. ఈ ఏడాది ప్రారంభం లో ఆయన కొత్తవాళ్లతో చేసిన ‘నిల్వకు ఎన్ మెల్ ఎన్నది కొంబన్’ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు ఆయన ఈ నెల 20 న కుబేర చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
I want to direct @PawanKalyan garu in Telugu ❤️
– #Dhanush at #Kuberaa Pre release
— Nizam PawanKalyan FC™ (@NizamPKFC) June 15, 2025